వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ ప్రభుత్వం సాయం చేయలే.. కార్తీక్ వాసుదేవ్ పేరంట్స్

|
Google Oneindia TeluguNews

టోరంటోలో ఓ విద్యార్థిపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే అతనికి మృతదేహం తరలింపు కోసం కెనడా, భారత ప్రభుత్వాలు స్పందించడం లేదట. ఇదే విషయాన్ని అతని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. తమకు ఫాస్ట్ ట్రాప్ వీసా ఇప్పించాలని కోరుతున్నారు. మృతుడు కార్తీక్ వాసుదేవ్ తండ్రి విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ట్వీట్ చేశారు. పరిస్థితి గురించి తెలియజేసిన అతను ఇంకా స్పందించలేదట. విద్యార్థి మృతిపై జై శంకర్ స్పందించారు. సంతాపం తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం లోకల్ సబ్ వే స్టేషన్ వద్ద షూటింగ్ జరిగిందని సమాచారం ఉంది. సబ్ వే ఎంట్రెన్స్ వద్ద కార్తీక్‌పై కాల్పులు జరిగాయి.

కార్తీక్‌కు పలు చోట్ల తూటాలు దిగాయి. అతనికి ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని వివరించారు. కాల్పుల ఘటనపై టోరంటోలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆశ్చర్య పోయింది. ఇదీ దురదృష్టకర ఘటనగా అభివర్ణించింది. అంతేకాదు అతని మృతదేహం స్వదేశం తరలించేందుకు సాయం చేస్తామని ఆ సమయంలో చెప్పింది.

no assistance by india, canada governments:student Family allege

పై చదువుల కోసం కార్తీక్.. ఈ జనవరిలో కెనడా వెళ్లారు. మెక్సికన్ రెస్టారెంట్‌లో పనిచేసేందుకు వెళుతుండగా కాల్పులు జరిగాయి. గురువారం అతను పేరంట్స్‌తో మాట్లాడాడు. రెండు వారాల క్రితం అతను విధుల్లో చేరారు. ఇంతలోనే ఇలా జరిగింది. కానీ మృతదేహం తరలించే ఏర్పాట్లలో జాప్యం జరుగుతుంది. దీంతో అతని పేరంట్స్ ఇరు దేశ ప్రభుత్వాలపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.

English summary
family of Indian student in Toronto who succumbed to his injuries demanded a fast-track visa process so that they can travel to Canada as they suspect officials trying to notch up the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X