వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron:ఒమిక్రాన్ వల్ల ఇప్పటివరకు ఒక్కరు చనిపోలే: ప్రపంచ ఆరోగ్య సంస్థ

|
Google Oneindia TeluguNews

ఎముకలు కొరికే చలిలో కూడా ఒమిక్రాన్ వైరస్ వణుకు పుట్టిస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య విషయం తెలిసింది. ఇప్పటికే 38 దేశాల్లో వైరస్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఒక్క మరణం కూడా సంభవించలేదని వివరించింది. వేగంగా వ్యాపిస్తోందని.. మాత్రం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని పేర్కొంది.

Recommended Video

Omicron Variant Already In Major Cities Of India, Wake Up Call | Oneindia Telugu

వైరస్ వల్ల ఆరోగ్యం బాగా క్షీణిస్తోందని గుర్తుచేసింది. మరికొన్ని నెలల్లో సగం యూరప్ ఖండానికి వైరస్ సోకుతుందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టియానా జార్జియా తెలిపారు. ఇప్పటికే డెల్టా చేసిన నష్టాన్ని గుర్తుచేసింది. డెల్టా, బీటా కన్నా రీ ఇన పెక్షన్ అయ్యే అవకాశం ఒమిక్రాన్ మూడు రెట్లు ఎక్కువ అని సౌతాఫ్రికా పరిశోధకులు తెలిపారు.

 No deaths yet as Omicron grips 38 countries: WHO

ఒమిక్రాన్ వేరియంట్ గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. దేశంలో ఇప్పటికే 4 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొత్త వేరియంట్ గురించి మాజీ సీఎస్ఐఆర్ చీఫ్, మాజీ సీసీఎంబీ చీఫ్ రాకేశ్ మిశ్రా సంచలన విషయం తెలియజేశారు. కరోనా వైరస్ ఇప్పటికే దేశంలో ఉందని హాట్ కామెంట్స్ చేశారు. విదేశాల నుంచి రాలేదని.. ఎయిర్ పోర్టుల నుంచి రాలేదని చెప్పారు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఉందని వివరించారు.

ఇటు హైదరాబాద్‌లో దిగిన ఓ లండన్ యువతీ నమూనాలను కూడా జినొమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. రాజస్తాన్, మిగత చోట్ల కూడా అనుమానితులు ఉన్నారు. కానీ వారికి ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ నిర్ధారణ మాత్రం కాలేదు. ప్రస్తుతం ఉన్న మూడు కేసులు తగ్గితే సరిపోతుంది. కానీ వారి వల్ల ఇతరులకు వ్యాప్తి చెందితెనే ప్రమాదం.

ఇటు సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన సంగతి తెలిసిందే. 66 ఏళ్ల వ్యక్తికి ట్రావెల్ హిస్టరీ ఉంది. అతను నవంబర్ 20వ తేదీన వచ్చారు. అప్పుడు నెగిటివ్ ఉండగా.. బెంగళూరు ఎయిర్ పోర్టులో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. 22వ తేదీన జినొమ్‌కు పంపించగా.. 23వ తేదీన నెగిటివ్ వచ్చింది. అతను 24 మంది ప్రైమరీ, 240 సెకండరీ కాంటాక్ట్‌గా ఉన్నాయి. అతను దుబాయ్ ట్రావెల్ చేశాడు. అన్నీ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వెతికీ మరీ పరీక్షలను చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వచ్చిన వారికి స్వల్పంగా లక్షణాలు ఉన్నాయని.. అందరూ రెండు టీకాలు తీసుకున్నారని వివరించారు.

English summary
Omicron variant has been detected in 38 countries but no deaths have yet been reported, the WHO said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X