యుద్ధ భూమిలో పరిష్కారం లభించదు: పోలండ్ ప్రధానితో మోడీ భేటీ, కీలక వ్యాఖ్యలు

వార్సా: యుద్ధ భూమిలో ఏ సమస్యకు పరిష్కారాలు లభించదనే విషయాన్ని భారత్ బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఉక్రెయిన్ తోపాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరమని అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసిన ఆయన.. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పునరుద్ధరణకు అన్ని విధాలా సహకరించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

పోలండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీ తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 'ఉక్రెయిన్‌, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలు మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించేవి. యుద్ధ క్షేత్రంలో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదని భారత్‌ బలంగా విశ్వసిస్తోంది. ఏ సంక్షోభంలోనైనా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం యావత్ మానవాళికే అతి పెద్ద సవాల్​‌గా మారింది. సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరత నెలకొనడానికి మేము దౌత్యాన్ని, చర్చలను సమర్థిస్తాం. అందుకోసం భారత్​ తన మిత్రదేశాలతో కలిసి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉంది' అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

No solution found in war land Modi meets Poland PM

రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా పోలండ్ వెళ్లిన ప్రధాని మోడీ.. ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్​‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చించామని, తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సమయంలో ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు అవసరమని భారత్‌, పోలండ్ భావిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత విద్యార్థుల తరలింపునకు పోలండ్‌ ఎంతో సహకరించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ప్రధాని మోడీ. భేటీలో భాగంగా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని పెంపొందించే విషయాలపై చర్చించినట్లు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా తెలిపారు. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా సామాజిక భద్రతా ఒప్పందానికి మేము అంగీకరించడం సంతోషకరంగా ఉందని వ్యాఖ్యానించారు.

రెండు దేశాల భాగస్వామ్యంలో ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనదని పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌ అన్నారు. 45ఏళ్ల అనంతరం భారత ప్రధానిని వార్సాలో చూడటం సంతోషంగా ఉందని, ఈ పర్యటన ఇరుదేశాల భాగస్వామ్యానికి సరికొత్త ఊపునిస్తుంది అని అన్నారు. కాగా, రెండు రోజుల పోలండ్ పర్యటన అనంతరం ప్రధాని మోడీ ఉక్రెయిన్​‌కు వెళ్లనున్నారు. పోలండ్‌ నుంచి రైలులో బయలుదేరి 10 గంటల ప్రయాణం అనంతరం మోడీ ఉక్రెయిన్‌కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అవుతారు. అక్కడి పరిస్థితులపై చర్చించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+