వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెడిసిన్‌లో జపాన్ ప్రొఫెస‌ర్‌ యొషినోరి ఒషుమికి నోబెల్ ప్రైజ్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

స్టాక్‌హోమ్‌: 2016 సంవత్సరానికి గాను వివిధ రంగాలకు సంబంధించి నోబెల్ ప్రైజ్ ప్రకటలను మొదలయ్యాయి. ఈ ఏడాది వైద్య‌రంగం(మెడిసిన్) విభాగంలో జ‌పాన్‌కు చెందిన యోషినోరి ఒషుమికి నోబెల్ ప్రైజ్ దక్కింది. ఈ మేరకు సోమవారం స్టాక్‌హోమ్‌లోని నోబెల్ క‌మిటీ ప్ర‌క‌టించింది.

క‌ణాల వినాశనానికి సంబంధించి (ఆటోఫాగి) ఆయ‌న చేసిన ఆవిష్క‌ర‌ణ‌ల‌కుగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఆయ‌న‌కు దక్కింది. జీవ పరిణామ క్రమంలో కణాలు వినాశం చెందుతుండగా, నూతన కణాల ఉత్పత్తికి సంబంధించి అధ్యయనం చేయడమే అటాఫజీ.

Nobel Prize in Medicine awarded to Yoshinori Ohsumi

యోషినోరి ప్ర‌స్తుతం టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ ఆటోఫాగి అన్న ప‌దాన్ని తొలిసారి 1963లో క్రిస్టియ‌న్ డీ డూవ్ వాడారు. ఈయ‌న‌కు కూడా 1974లో మెడిసిన్ నోబెల్ ల‌భించింది. ఆటోఫాగి 1960ల‌లో బాగా వాడుక‌లోకి వ‌చ్చింది.

ప్రైజ్ కింద 9లక్షలా 30 వేల అమెరికా డాలర్ల నగదు బహుమతిగా ఇస్తారు. కాగా, మంగళవారం ఫిజిక్స్‌లో బుధవారం కెమిస్ట్రీ, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు. కాగా గ‌తేడాది మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ ముగ్గురిని వ‌రించిన సంగ‌తి తెలిసిందే.

English summary
The 2016 Nobel Prize in Physiology or Medicine has been awarded to Yoshinori Ohsumi “for his discoveries of mechanisms for autophagy.” The professor is currently at the Tokyo Institute of Technology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X