మహిళ సహా ముగ్గురికి ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి: ఆర్థర్, గెరార్డ్, డొన్నాలకు పురస్కారం
స్వీడన్: భౌతికశాస్త్రంలో మంగళవారం నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. ముగ్గురికి ఈ పురస్కారం లభించింది. ఆర్థర్ ఆష్కిన్ (అమెరికా), గెరార్డ్ మౌరా (ఫ్రాన్స్), డోన్నా స్క్రిక్లాండ్ (కెనడా)లను నోబెల్ వరించింది.
అక్టోబర్ నెల రాగానే ప్రపంచమంతా నోబెల్ బహుమతులపై ఆసక్తిగా ఎదురు చూస్తుంది. డైనమెట్ రూపకర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట 1901 నుంచి ఈ పురస్కారాలను వివిధ రంగాల్లో అత్యుత్తమ పరిశోధనలకు, సేవలకుగాను అందజేస్తుంటారు.

వైద్యశాస్త్ర విభాగంలో తొలి విజేతను ప్రకటించడం ద్వారా ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతుల పండుగ ప్రారంభమవుతుంది. సోమవారం అలిసన్, హోంజో జంటకు వైద్యరంగ నోబెల్ ప్రకటించిన రాయల్ స్వీడిష్ ఎకాడమీ, మంగళవారం భౌతికశాస్త్రంలో ప్రకటించింది. బుధవారం రసాయన శాస్త్రం పురస్కారాలను ప్రకటించనుంది.
శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటిస్తారు. నోబెల్ సాహిత్య పురస్కారంపై గత మూడేళ్లుగా వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈసారి కూడా సాహిత్య నోబెల్ ప్రదానాన్ని వాయిదా వేశారు. 2018 సంవత్సరపు నోబెల్‌ను వచ్చే ఏడాది పురస్కారాలతోపాటే అందజేస్తామని రాయల్ స్వీడిష్ ఎకాడమి ప్రకటించింది. 1949లో విలియం ఫ్రాల్కనర్స్‌కు ప్రకటించిన పురస్కారాన్ని తర్వాత ఏడాది 1950 పురస్కారాలతోపాటు అందించారు. ఆ తర్వాత సాహిత్య నోబెల్‌ను ఇలా వాయిదా వేయడం ఇదే తొలిసారి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications