విదేశాల్లో ట్రంప్... అదను చూసి క్షిపణి ప్రయోగించిన ఉత్తరకొరియా కిమ్!
వారం రోజుల క్రితమే అత్యాధునిక ఖండాంతర క్షిపణి ప్రయోగించి విజయం సాధించిన కిమ్ వారం రోజులు కూడా గడవక ముందే ఆదివారం మధ్యాహ్నం మరో క్షిపణిని ప్రయోగించి అంతర్జాతీయంగా అలజడి సృష్టించారు.
సియోల్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ శత్రుదేశాలు ఊహించలేనంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటనలో ఉండగా అదను చూసుకుని క్షిపణి ప్రయోగాలకు పాల్పడుతున్నారు.
వారం రోజుల క్రితమే అత్యాధునిక ఖండాంతర క్షిపణి ప్రయోగించి విజయం సాధించిన కిమ్ వారం రోజులు కూడా గడవక ముందే మరొకసారి సంచలనం సృష్టించారు. ఆదివారం మధ్యాహ్నం మరో క్షిపణిని ప్రయోగించి అంతర్జాతీయంగా అలజడి సృష్టించారు.

ఈ క్షిపణి ప్రయోగాన్ని దక్షిణకొరియా మిలిటరీ అధికారులు కూడా ధృవీకరించారు.
అయితే అది ఎలాంటి క్షిపణి, దాని ప్రత్యేకతలు ఏమిటన్న వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. ఓ వార్త సంస్థ మాత్రం అది కూడా ఖండాతర క్షిపణిగా పేర్కొంది. కానీ.. ఈ వార్తను దక్షిణకొరియా అధికారులు ఖండించారు. ప్రయోగించిన క్షిపణి ఏంటనేది స్పష్టంగా తెలియదని వారు పేర్కొన్నారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొట్టమొదటి విదేవీ పర్యటనలో ఉన్నారు. తాజా పరిస్థితిపై.. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై సౌదీ అరేబియాలో ఉన్న ఆయన స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఆందోళనకర పరిస్థితులు ఏర్పడం, కిమ్ దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఆందోళనలు మరింత వేడెక్కుతున్నాయి.
మరోవైపు ఉత్తరకొరియా దూకుడుపై అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరకొరియా అంచనాలకంటే ఎక్కువగానే అణ్వాయుధాలను తయారు చేస్తోందనేది వారి అనుమానం. ఇంతవేగంగా ఆయుధాలను తయారు చేయడం వెనుక ఉత్తరకొరియా ఉద్ధేశం ఏమిటన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది.












Click it and Unblock the Notifications