వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ చిన్నోడి సంచలనం.. ఉత్తరకొరియాను ముప్పుతిప్పలు పెట్టింది

|
Google Oneindia TeluguNews

ఉత్తరకొరియా : ప్రపంచ దేశాలన్నింటిది ఓ దారైతే, ఉత్తరకొరియా దేశానిది మరో దారి. ఏంచేసినా ఇతరులకు భిన్నంగా ఉండాలని ప్రయత్నించడం బహుశా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఆలోచనల్లో భాగమై ఉంటుంది.

అందుకే హైడ్రోజన్ బాంబు పేరుతో ప్రపంచ దేశాలను వణికించాలని చూసినా..! మొన్నీమధ్యే తన చెల్లి పెళ్లికి స్వయంవరం ప్రకటించి పెళ్లికి ముందు డేటింగ్ తప్పనిసరి అని నిబంధన పెట్టినా అదే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ కే చెల్లింది.

తాజాగా మరో కొత్త ప్రయత్నంతో అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఉత్తరకొరియా వ్యవహారం. చైనాలాగే తమదేశంలోను స్వదేశీ సైట్లను వినియోగంలోకి తీసుకురావాలన్నా ఆలోచనలో భాగంగా, ప్రపంచ దేశాలు ఉపయోగిస్తున్న ఫేస్ బుక్ కాకుండా, తమ దేశానికంటూ ప్రత్యేక ఫేస్ బుక్ తయారుచేసుకున్నారు ఉత్తరకొరియా దేశస్తులు.

north korea facebook was hacked

ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. అయితే దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన కొద్దిగంటల్లోనే అది హ్యాకింగ్ గురైంది. దీంతో సమస్యను పరిష్కరించేందుకు ఉత్తరకొరియా నానా అవస్థలు పడింది. ఇంతకీ ఆ దేశ ఫేస్ బుక్ ని హ్యాక్ చేసిందెవరంటే.. స్కాట్లాండ్ కి చెందిన ఆండ్రూ మెక్ కీన్ అనే ఓ టీనేజర్.

ఉత్తరకొరియా ఫేస్ బుక్ లో తానేమి ఆప్షన్స్ క్రియేట్ చేయలేదని, కేవలం లాగిన్ పాస్ వర్డ్ మాత్రమే కనుక్కునేందుకు ప్రయత్నించానని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. అయితే ఈ చిన్నోడు చేసిన పనికి ఉత్తరకొరియా ఫేస్ బుక్ అడ్మిన్ అకౌంట్ కొన్ని గంటలపాటు హ్యాక్ అయింది.

ఇదిలా ఉంటే గతేడాది నుంచే ఉత్తరకొరియాలో ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ సైట్స్ ను అక్కడ నిషేధించారు.

English summary
north korea facebook was hacked by a scottish teenager for a few hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X