పశ్చిమాసియా సద్దుమణుగుతున్న వేళ.. బాలిస్టిక్ మిస్సైల్ సంధించిన నార్త్ కొరియా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గముఖం పడుతున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య మలి విడత చర్చలకూ పూనుకున్నాయి. ఈ సారి కూడా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాదే దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ నెల 20వ తేదీన ఈ రెండు దేశాల ముఖ్య ముఖాముఖి చర్చలు జరుగనున్నట్లు సీఎన్ఎన్ తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇరాన్ ను ఉటంకిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఈ పరిణామాల మధ్య ఉత్తర కొరియా తెరమీదికి వచ్చింది. తూర్పు తీరం నుంచి శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులను సంధించింది. దక్షిణ కొరియా, జపాన్ దీన్ని ధృవీకరించాయి కూడా. దీన్ని రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించాయి. ప్రజల భద్రత, ప్రాంతీయ స్థిరత్వం కోసం జపాన్ ప్రభుత్వం తన అత్యున్నత స్థాయి సంక్షోభ నిర్వహణ ప్రోటోకాల్స్‌ను తక్షణమే అమలులోకి తీసుకుని రావడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది.

North Korea Fires Powerful Multiple Ballistic Missiles Toward East Sea Triggering Regional Alarm

ఉత్తరకొరియా సిన్పో ఈస్ట్ కోస్ట్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ ఏడాది ఉత్తర కొరియా సంధించిన ఏడో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు ఇవి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నాలుగుసార్లు క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు పతాక స్థాయికి చేరుకున్న దశలో ఈ దుందుడుకు చర్యలకు దిగారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్. ఒకదశలో ఇరాన్ కు మద్దతుగా యుద్ధరంగంలోకి దిగడానికి సన్నద్ధంగా ఉన్నాననీ చెప్పుకొచ్చారు. అమెరికాకు వ్యతిరేకంగా పని చేయడానికి సిద్ధమనీ వెల్లడించారు.

దీనిపై జపాన్ ప్రధాని సనాయ్ తకైచి మాట్లాడారు. ఈ తెల్లవారు జామున 6 గంటల ప్రాంతంలో ఉత్తర కొరియా నుంచి పలు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారని తెలిపారు. ఈ విషయాన్ని తన అధికార ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆయా మిస్సైళ్లన్నీకూడా క్షిపణులు జపాన్ గగనతలం మీదుగా సాగినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. దీన్ని ప్రాంతీయ ఉల్లంఘన చర్యగా ఆమె పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జపాన్, అమెరికా, దక్షిణ కొరియా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోన్నాయి. వాటిని విశ్లేషిస్తోన్నాయి.

అటు దక్షిణ కొరియా కూడా దీన్ని నిశితంగా పరిశీలిస్తోంది. అధ్యక్ష కార్యాలయం అత్యవసర భద్రతా సమావేశాన్ని నిర్వహించింది. ఉత్తరకొరియా నిరంతర ఆయుధ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితి భద్రతమండలి నిషేధించినప్పటికీ యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, దీనిపై కఠిన హెచ్చరికలను జారీ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+