నియంత కిమ్‌ సంచలనం: ద.కొరియా, జపాన్ కలకలం: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతున్న వేళ

సియోల్: ఆధునిక నియంతగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్.. తన తీరును మార్చుకోవట్లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినప్పటికీ.. దాని మీద ఏ మాత్రం దృష్టి పెట్టట్లేదు. ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలతో సరికొత్త ప్రయోగాలను కొనసాగిస్తోన్నారు. పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు కిమ్‌జొంగ్.

దక్షిణకొరియా సముద్ర జలాల్లోకి..

దక్షిణకొరియా సముద్ర జలాల్లోకి..

తాజాగా దక్షిణ కొరియా సముద్ర జలాల్లోకి క్షిపణిని ప్రయోగించింది ఉత్తర కొరియా. అత్యంత శక్తిమంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్‌ను సంధించింది. క్షిపణి పరీక్షల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించింది. టెస్ట్ ఫైరింగే అయినప్పటికీ.. తన మిస్సైళ్లను దక్షిణ కొరియా సముద్ర జలాల్లోకి సంధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో అటు దక్షిణ కొరియా, ఇటు జపాన్ ఉలిక్కిపడ్డాయి. ఉత్తర కొరియా మిస్సైల్స్ ప్రయోగ పరీక్షలను నిశితంగా గమనిస్తోన్నాయి.

సేఫ్టీ అడ్వైజరీని జారీ చేసిన జపాన్..

సేఫ్టీ అడ్వైజరీని జారీ చేసిన జపాన్..

ఉత్తర కొరియా తమ దేశ తూర్పు సముద్ర జలాల్లోకి బాలిస్టిక్ క్షిపణిని సంధించిన విషయాన్ని దక్షిణ కొరియా ధృవీకరించింది. ఆ దేశ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఈ విషయాన్ని నిర్ధారించారు. అన్‌ ఐడెంటిఫైడ్ ప్రాజెక్టైల్‌ను ప్రయోగించిందని, అది బాలిస్టిక్ క్షిపణి అయి ఉంటుందని పేర్కొన్నారు. జపాన్ మిలటరీ అధికారులు కూడా దీన్ని నిర్ధారించారు. క్షిపణి ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని జపాన్ కోస్ట్ గార్డ్ అధికారులు మ్యారిటైమ్ సేఫ్టీ అడ్వైజరీని జారీ చేశారు.

ఏడు క్షిపణులు..

ఏడు క్షిపణులు..

గత ఏడాది డిసెంబర్-జనవరిల్లో ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ మిస్సైళ్లను టెస్ట్ ఫైర్ చేసింది. కిందటి నెలలో ఏకంగా ఏడు క్షిపణులను పరీక్షించింది. వాటన్నింటినీ దక్షిణ కొరియా సముద్ర జలాల్లోకి సంధించింది. చివరిసారిగా కిందటి నెల 30వ తేదీన హ్వాసాంగ్-2 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించింది. ఆ తరువాత క్షిపణి పరీక్షలకు విరామాన్ని ప్రకటించింది. దీనికి కారణం- చైనా. బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని క్షిపణుల ప్రయోగాలను నిలిపివేసింది. అది తాత్కాలికమేనని తాజా ప్రయోగంతో స్పష్టమైంది.

అణ్వస్త్రాల పరీక్షలపై

అణ్వస్త్రాల పరీక్షలపై

ఉత్తర కొరియా చేపట్టిన అణ్వస్త్రాల పరీక్షలపై ఆ దేశంతో చర్చించడానికి అమెరికా ఇప్పటికే సన్నద్ధమైన విషయం తెలిసిందే. దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా పని చేసి, పదవీ విరమణ చేసిన సుంగ్ కిమ్‌ను దూతగా అపాయింట్ చేసింది అమెరికా. ఉత్తర కొరియా ప్రభుత్వ పెద్దలతో చర్చించడానికి ఆయనను రాయబారిగా నియమించింది. ఈ నియామకం పూర్తయిన అతి కొద్దిరోజుల్లోనే ఉత్తర కొరియా ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానికి పూనుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రెండేళ్లుగా స్తంభించిన చర్చలు..

రెండేళ్లుగా స్తంభించిన చర్చలు..

అణ్వస్త్రాల ప్రయోగాలు, ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంపై ఇది వరకు అమెరికా-ఉత్తర కొరియా మధ్య చర్చలు సాగాయి. దీనిపై 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్‌జొంగ్ ఉన్ స్వయంగా ఈ చర్చల్లో పాల్గొన్నారు. కొన్ని కీలక విషయాల్లో ఏకాభిప్రాయం కుదురకపోవడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఆ తరువాత అమెరికా కొన్ని ఆంక్షలను విధించింది ఉత్తర కొరియాపై. వాటిని పరిగణనలోకి తీసుకోవట్లేదు కిమ్‌జొంగ్. తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూనే ఉన్నారు. న్యూక్లియర్ వెపన్స్‌కు ప్రాధాన్యత ఇస్తోన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతున్న వేళ..

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతున్న వేళ..

ఉక్రెయిన్ మీద రష్యా విరుచుకుపడుతోంది. నాలుగో రోజు మరింత ఉధృతమైంది. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టాయి. అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. వారి దూకుడును ఉక్రెయిన్ ఆర్మీ.. ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కీవ్‌ను సొంతం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను విఫలం చేస్తోంది. ఈ రెండు దేశాల సైన్యం మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య కిమ్‌జొంగ్- క్షిపణి ప్రయోగాలను కొనసాగించడం పట్ల దక్షిణ కొరియా, జపాన్ ఆందోళనకు గురవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+