అమెరికాపై దాడి చేస్తే.. ఇలా ఉంటుంది: ఉ.కొరియా షాకింగ్ వీడియో

Posted By:
Subscribe to Oneindia Telugu

పోంగ్‌యాంగ్: అమెరికాలోని నగరాలపై తాము అణు బాంబు దాడి చేస్తే ఎలా ఉంటుందో చూడండంటూ.. ఉత్తర కొరియా ఓ వీడియోను రూపొందించి, విడుదల చేసింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది.

ఉ.కొరియా కింగ్‌కు ఎదురుదెబ్బ: ఫెయిల్ అయిన కీలక క్షిపణి

అమెరికా - ఉత్తర కొరియాలకు అస్సలు పడదు. తాజా వీడియోతో కొరియా మరోసారి కవ్వింపు చర్యకు పాల్పడింది. ఉ కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌-2 సంగ్‌ గౌరవార్థం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ వీడియోను ప్రదర్శించారు.

క్షిపణులతో దాడి..

క్షిపణులతో దాడి..

పసిఫిక్‌ సముద్రం మీదుగా అమెరికాపై వరుస పెట్టి ఉత్తర కొరియా క్షిపణులతో దాడి చేస్తుంది. ఆ తర్వాత ఓ పెద్ద బాంబును అమెరికాపై విసరుతుంది. దీంతో అమెరికాలోని నగరాలన్నీ పూర్తిగా ధ్వంసమవుతాయి. చివరలో అమెరికా జెండా కాలిపోయినట్లుగా ఉంటూ దానిపై శవపేటిక ఆకారం కనిపించడంతో వీడియో ముగుస్తుంది.

కరతాళ ధ్వనులు

కరతాళ ధ్వనులు

వీడియో ప్రదర్శన అయిపోయిన అనంతరం ఉ.కొరియా మిలిటరీ అధికారులు కరతాళ ధ్వనులు మోగించారు. అది చూసిన ఆ దేశ అధ్యక్షులు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆనందంతో అభివాదం చేశారు. అయితే, ఈ వీడియో బయటకు రాలేదు.

వీడియో ఇలా బయటకు

వీడియో ఇలా బయటకు

ఉ.కొరియా నిబంధనల ప్రకారం చాలా కొద్దిమందికి మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటుంది. అది కూడా ప్రభుత్వంతో అనుసంధానించి ఉండటంతో వీడియో బయటకు రాలేరు. ఉ.కొరియా ప్రభుత్వ అధీనంలో పని చేస్తున్న టీవీ ఛానళ్లు మాత్రం ఈ వీడియోను ప్రసారం చేశాయని తెలుస్తోంది.

గతంలోను హెచ్చరికలు

గతంలోను హెచ్చరికలు

అమెరికాపై ఉ.కొరియా ఇలాంటి హెచ్చరింపులకు గతంలోను పలుమార్లు పాల్పడింది. అమెరికాను నాశనం చేసినట్లుగా ఉన్న వీడియోలను ఉ.కొరియా రూపొందించిన సందర్భాలున్నాయి.

లాస్ట్ ఛాన్స్!

లాస్ట్ ఛాన్స్!

2016లో లాస్ట్‌ ఛాన్స్‌ పేరుతో విడుదల చేసిన వీడియోలో వాషింగ్టన్‌పై అణు దాడి చేసినట్లుగా చూపించారు. ఇక, 2013లో కొలంబియా, కాలిఫోర్నియా, హవాయి తదితర రాష్ట్రాలపై అణుదాడులు చేస్తున్న వీడియో విడుదల చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Korea propaganda video shows missile attack destroying US city.
Please Wait while comments are loading...