అణుబాంబు కన్నా తీవ్రమైనదే! బరువు 250 కిలో టన్నులు, ఉత్తరకొరియా మళ్లీ ఏదో చేస్తోంది.. ఏమిటది?
ఉత్తర కొరియా పరీక్షించిన హైడ్రోజన్ బాంబు విస్ఫోట సామర్థ్యం 250 కిలో టన్నులని అమెరికా పర్యవేక్షణ బృందం వెల్లడించింది. అంచనా వేసిన దానికన్నా ఇది మరెంతో ఎక్కువని తెలిపింది.
సియోల్: ఉత్తర కొరియా పరీక్షించిన హైడ్రోజన్ బాంబు విస్ఫోట సామర్థ్యం 250 కిలో టన్నులని అమెరికా పర్యవేక్షణ బృందం వెల్లడించింది. అంచనా వేసిన దానికన్నా ఇది మరెంతో ఎక్కువని తెలిపింది.
1945లో జపాన్‌లోని నాగసాకిపై అమెరికా ప్రయోగించిన 15 కిలో టన్నుల అణుబాంబు కన్నా ఇది 16 రెట్లు అధిక శక్తిమంతమైందని వెల్లడించింది. ఉత్తర కొరియా గత వారం ఆరోసారి అతిపెద్ద అణుపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

క్షిపణి మోసుకెళ్లగల హైడ్రోజన్ బాంబును తాము పరీక్షించినట్టు ఉత్తరకొరియా ప్రకటించింది. ఈ ప్రయోగం వల్ల భూకంప లేఖినిపై 6.3 తీవ్రతతో భూమి కంపించిందని అమెరికా భూగర్భ పరిశోధక సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయంతో సంబంధమున్న 38 నార్త్ అమెరికా అనే వెబ్‌సైట్ ఉత్తర కొరియా బాంబు సామర్థ్యాన్ని 250 కిలో టన్నులుగా అంచనా వేసింది. దక్షిణ కొరియా, జపాన్‌లు అంచనా వేసినట్టు ఇది 50 లేదా 160 కిలో టన్నులు కాదని స్పష్టం చేసింది.
మరోవైపు ఉత్తర కొరియా పరీక్షించింది అసలు హైడ్రోజన్ బాంబా? కాదా? అని అమెరికా అధికారులు పరీక్షిస్తున్నారు. బాంబు పరీక్షించిన చోటుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఐదు రోజులు తర్వాత శుక్రవారం పరిశీలించారు.
అక్కడ ట్రక్కులు, మైనింగ్, ఇతర పనిముట్లు ఉన్నాయని, కయ్యాలమారి ఉత్తర కొరియా మళ్లీ ఏదో కార్యం తలపెట్టినట్టు తెలుస్తోందని వారు వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి కఠిన ఆంక్షల నేపథ్యంలో అమెరికాకు బుద్ధి చెప్పి తీరతామంటూ ఉత్తరకొరియా నియంత కిమ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications