14నిమిషాలు చాలు.. అంతా తుడిచిపెట్టుకుపోవడమే!: గువామ్‌పై దాడికి ఉ.కొరియా ప్లాన్?

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: పరిస్థితులు చూస్తుంటే అమెరికాకు తమ సామర్థ్యమేంటో చూపించాలని ఉత్తరకొరియా ఉవ్విళ్లూరుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ దేశం అణు క్షిపణులను తయారుచేసిన సంగతి తెలిసిందే.

అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా క్షిపణి ప్రయోగం చేపట్టి పరోక్షంగా యుద్ద సంకేతాలు పంపించింది. ఆపై తరుచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. దీనికి అమెరికా ధీటుగా హెచ్చరించేసిరికి.. యుద్దానికి సమాయత్తమయ్యేలా అణ్వాయుధాలు సిద్దం చేసుకుంటోంది.

ఉత్తర కొరియా 'ఖతర్నాక్ ప్లాన్'! జపాన్ మీదుగా గువామ్ దీవిపైకి.. హాసంగ్-12 మిస్సైళ్లతో దాడి!!

ఈ నేపథ్యంలోనే అమెరికా ఆధీనంలోని గువామ్ పై దాడి చేసేలా క్షిపణులను రూపొందించింది. తాజాగా తెలియవచ్చిన సమాచారం మేరకు.. ఈ క్షిపణులు కేవలం 14 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరుకుని అక్కడ విధ్వంసం సృష్టిస్తాయని తెలుస్తోంది.

North Korea's missiles attack guam just in 14minutes

గువామ్ హోమ్ లాండ్ భద్రతా ప్రతినిధి జెన్నా ఈ వివరాలు వెల్లడించారు.ఉత్తరకొరియా చర్యలపై గువామ్‌ ప్రాంత ప్రజలను ఆయన అప్రమత్తం చేశారు. ఉత్తరకొరియా యుద్దానికి గనుక దిగితే ప్రజలంతా అప్రమత్తమయ్యేలా 15హెచ్చరిక వ్యవస్థల ద్వారా వారికి సంకేతాలు పంపిస్తామని అన్నారు. గువామ్ లోని అన్ని ప్రాంతాల్లో హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయని అన్నారు.

కాగా, గువామ్ ద్వీపంలో దాదాపు 7వేల మంది అమెరికా భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఉత్తరకొరియా చర్యలను పసిగట్టేందుకు వీరంతా అప్రమత్తమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Korea's attack plan is creating high tension in America. America also approaching alternatives to stop North Korea
Please Wait while comments are loading...