ట్రంప్‌కు కిమ్ షాక్: 'భయపెట్టినంత కాలం అణు కార్యక్రమాలు చేస్తాం'

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యాంగ్యాంగ్: అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు తమను భయపెడుతున్నంత కాలం తాము అణు కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రకటించారు. అంతేకాదు తమ అణు సామర్థ్యాన్ని పెంచుకొనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని ఉత్తరకొరియా ప్రకటించారు.

ట్రంప్‌కు షాక్: వరుస ఉపగ్రహల ప్రయోగం, కిమ్ నెక్ట్స్ ప్లాన్ ఇదే

ఉత్తరకొరియా అనుసరిస్తున్న విధానాల కారణంగా అమెరికాతో పాటు దాని మిత్రదేశాలు భయాందోళనలు ఇబ్బందిపడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతోందోననే ఆందోళన కూడ నెలకొంది.

మాతోనే అమెరికాకు అణు ముప్పు, ప్రపంచంపై ప్రభావం: కిమ్ షాకింగ్ కామెంట్స్

అయితే ఉత్తరకొరియా అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలతో ప్రపంచదేశాలకు సవాళ్ళు విసిరారు. అయితే ఐక్యరాజ్యసమితి ఉత్తరకొరియాపై ఆంక్షలను విధించింది. అయితే ఉత్తరకొరియా ఆంక్షలను చైనా ఉల్లంఘిస్తోందని అమెరికా ఇటీవలనే ఆరోపణలను గుప్పించింది.

అణు కార్యక్రమాలు కొనసాగుతాయి

అణు కార్యక్రమాలు కొనసాగుతాయి

అమెరికా, దాని మిత్రదేశాలు తమను భయబ్రాంతులు చేస్తున్నంత కాలం అణు కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉత్తరకొరియా ప్రకటించింది. ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ఈ మేరకు శనివారం నాడు ఈ ప్రకటన చేసింది.

అణు సామర్థ్యాలు పెంచుకొంటాం

అణు సామర్థ్యాలు పెంచుకొంటాం

అమెరికా, దాని మిత్ర పక్షాల బ్లాక్‌మెయిల్, సైనిక విన్యాసాలను దృష్టిలో ఉంచుకొని స్వీయ రక్షణకు అణు సామర్థ్యాలను పెంచుకొంటామని ఉత్తరకొరియా ప్రకటించింది. ఈ ప్రకటనను బట్టి చూస్తే రానున్న రోజుల్లో మరిన్ని అణు పరీక్షలను ఉత్తరకొరియా చేసే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు.

అమెరికా విద్వేషాన్ని చిమ్ముతోంది

అమెరికా విద్వేషాన్ని చిమ్ముతోంది

ఉత్తరకొరియాపై అమెరికా విద్వేషాన్ని చిమ్ముతోందని ఆ దేశం ప్రకటించింది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విద్వేషాన్ని రెచ్చగొడుతూ దాడులకు పాల్పడుతున్నారని ఉత్తరకొరియా అధికారిక మీడియా ఆరోపణలు చేసింది. తమ దేశాన్ని బెదిరిస్తున్నారని ఉత్తరకొరియా ప్రకటించింది.

ఉత్తరకొరియాను అణగదొక్కలేరు

ఉత్తరకొరియాను అణగదొక్కలేరు

ఉత్తరకొరియాను బలహీనపర్చలేరని ఆ దేశ మీడియా ప్రకటించింది. తమ విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆ దేశం ప్రకటించింది.ఉత్తర కొరియా కొత్త వ్యూహాత్మక, అణుశక్తిగా ఎదిగిందనడంలో సందేహం అక్కర్లేదన్నారు. అజేయ శక్తిగా మారిన ఉత్తర కొరియాను బలహీనపరచలేరని, అణగదొక్కలేరని ఉత్తరకొరియా మీడియా ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Korea said Saturday that it will never give up its nuclear weapons as long as the United States and its allies continue their "blackmail and war drills" at its doorstep.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి