అమ్మో.. కిమ్! కొంప ముంచేలాగే ఉన్నాడు, క్షిపణుల తరలింపును పసిగట్టిన అమెరికా శాటిలైట్లు!

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపానికి క్షిపణులు తరలిస్తున్నారు.

Recommended Video

    కింగ్ జాంగ్ ఉన్ దూకుడు: మరో అణు పరీక్షకు సిద్ధమయ్యాడా?

    వాషింగ్టన్: ఉత్తరకొరియా లొంగేలాగ కనిపించడం లేదు. ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. తాజాగా ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపానికి క్షిపణులు తరలిస్తున్నారు. ఉత్తరకొరియాపై నిఘా పెట్టిన అమెరికా శాటిలైట్లు తీసిన చిత్రాల్లో ఈ విషయం స్పష్టమైంది.

    అమెరికాపై దాడి చేసే తీరుతామంటూ మాటల బాంబులు విసురుతున్న ఉత్తరకొరియా నియంత కిమ్ లోలోపల ఆ దిశగా చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతున్నట్లు దీనిని బట్టి స్పష్టమవుతోంది.

    దీంతో అమెరికా రక్షణ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఉత్తరకొరియాలో తరలిస్తున్న క్షిపణులు వాసాంగ్-14 ఇంటర్‌ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లా? లేక వాసాంగ్-12 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లా? అనే విషయాన్నివారు పరిశీలిస్తున్నారు.

    North Korea spotted 'moving missiles' amid NUKE ATTACK fears

    కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో అమెరికా బాంబర్లు చక్కర్లు కొట్టిన రోజుల వ్యవధిలోనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఇలా దూకుడుగా వ్యవహరించడం ఏ విపరీతాలకు దారితీస్తుందో?

    కొన్ని రోజులు మౌనంగా ఉన్న కిమ్ మళ్లీ ఇటీవలే హెచ్చరికలు మొదలుపెట్టారు. అమెరికా అధీనంలోని గువామ్ ద్వీపంపై దాడికి ట్రిగ్గర్ నొక్కేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే క్షిపణులు తరలిస్తుండడంతో ఏ క్షణంలో అణుయుద్ధం ముంచుకొస్తుందో అని అమెరికా ప్రజలు భయపడుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+