హరికేన్లు కాదు, పదింతలు విరుచుకుపడుతాం: అమెరికాపై ఉత్తర కొరియా

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికాను ముంచెత్తేది తుపానులు, హరికేన్లు కాదని, అంతకు పదింతలు శక్తిమంతమైన తాము విరుచుకుపడతామని ఉత్తర కొరియా తాజా హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తర కొరియా ఎపెక్ట్: చైనా సైంటిస్ట్‌ల పరిశోధనలో షాకింగ్, కిమ్‌కు చెక్

ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రంగా స్పందించిన ఆ దేశ విదేశాంగ శాఖ.. అమెరికా ఆత్మ రక్షణలో పడే, ఐక్యరాజ్యసమితిని అడ్డు పెట్టుకుని తమపై ఒత్తిడి తెస్తోందన్నారు.

అమెరికా ఒత్తిడి తెస్తోందని ఆగ్రహం

అమెరికా ఒత్తిడి తెస్తోందని ఆగ్రహం

ఐక్య రాజ్య సమితికి ఇచ్చిన ఓ ముసాయిదా ఆంక్షల పత్రంలో తమ దేశం నుంచి ఆయిల్, చేనేత ఉత్పత్తుల దిగుమతులను అన్ని దేశాలూ నిలిపివేయాలని, తమ అధినేత కిమ్ జాంగ్ ఉన్‌పై ప్రయాణ నిషేధం విధించాలని యూఎస్ ఐరాసపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించింది. కాగా, హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించిన తర్వాత, ఆ దేశంపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి పెరుగుతున్న విషయం తెలిసిందే.

కసితో పని చేస్తున్నారని

కసితో పని చేస్తున్నారని

అమెరికాపై కసితో తమ సైనికులు, రక్షణ శాఖ నిపుణులు కలిసి పని చేస్తున్నారని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి చోయ్ హూన్ చోలై తెలిపారు. ఉత్తరకొరియా అధికారిక మీడియాతో ఆయన మాట్లాడారు.

అమెరికా భూభాగంలో పడుతుంది

అమెరికా భూభాగంలో పడుతుంది

అమెరికా ప్రధాన భూభాగంలో ఉత్తర కొరియా న్యూక్లియర్ మిస్సైల్ పడుతుందన్నారు. ట్రంప్ బెదిరింపులు లేదా ఐక్య రాజ్య సమితి ఆంక్షలు తమను ఏమీ చేయలేవన్నారు. అమెరికా కుయుక్తులను ఉత్తర కొరియా పసిగట్టిందన్నారు.

దోషిగా చేయాలని ప్రయత్నం

దోషిగా చేయాలని ప్రయత్నం

ప్రపంచ దేశాల ముందు ఉత్తర కొరియాను దోషిని చేసి నిలబెట్టాలనదే అమెరికా ప్రయత్నమని ఆయన విమర్శించారు. ఏదో ఒకరోజు తప్పకుండా ఉత్తర కొరియా న్యూక్లియర్ మిస్సైల్ అమెరికా ప్రధాన భూభాగంలో పడితీరుతుందన్నారు.

అమెరికా ఆయుధాల కంటే శక్తివంతమైనవి

అమెరికా ఆయుధాల కంటే శక్తివంతమైనవి

ప్రస్తుతం తమ దేశం అంత్యంత బలమైన అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశమని తెలిపారు. తమ దగ్గరున్న ఆయుధాలు అమెరికా దగ్గరున్న ఆయుధాల కంటే ఎంతో శక్తిమంతమైనవన్నారు. అమెరికా వేసే ప్రతి అడుగును తమ నిఘా వ్యవస్థ నిశితంగా గమనిస్తోందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The United States will pay a "due price" if harsh sanctions against North Korea are agreed at a United Nations Security Council meeting in New York Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X