ట్రంప్‌కు కిమ్ షాక్: అమెరికాను బూడిద చేస్తాం: ఉ. కొరియా

అమెరికాను బూడిద చేస్తానని ఉత్తరకొరియా తీవ్రంగా హెచ్చరించింది. అణుపరీక్షలు నిర్వహించకుండా కట్టడి చేసేందుకు ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మరిన్ని ఆంక్షలు విధించింది.

సియోల్: అమెరికాను బూడిద చేస్తానని ఉత్తరకొరియా తీవ్రంగా హెచ్చరించింది. అణుపరీక్షలు నిర్వహించకుండా కట్టడి చేసేందుకు ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మరిన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో అమెరికాపై ఉత్తరకొరియా తీవ్రంగా విరుచుకుపడింది.

ప్రపంచాన్ని ఉత్తర కొరియా వణికించేస్తోంది. జపాన్, దక్షిణ కొరియాలను లక్ష్యంగా చేసుకొని ఉత్తరకొరియా అణుపరీక్షలు, క్షిఫణి దాడులకు పాల్పడుతోంది.

 North Korea threatens to sink Japan and turn US to 'ashes and darkness'

అయితే ఉత్తరకొరియాను కట్టడి చేసేందుకు భద్రతా మండలి ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించింది. అమెరికాను బూడిద చేస్తామని ఉత్తరకొరియా అధికారిక మీడియా గురువారం నాడు ప్రకటించింది.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలితో తెగతెంపులు చేసుకొంటామని ఉత్తరకొరియా ఆసియా-ఫసిఫిక్ పీస్ కమిటీ తెలిపింది. అమెరికా అంధకారంలో మగ్గిపోనుందని కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. జపాన్ దేశంపై కూడ ఉత్తరకొరియా తీవ్రమైన హెచ్చరికలనే చేసింది. జపాన్‌ను సముద్రంలో ముంచెత్తుతామని ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+