జపాన్‌కు కిమ్ షాక్: అణుబాంబుతో సముద్రంలో కలిపేస్తాం

Posted By:
Subscribe to Oneindia Telugu
  North Korea Ready To 'Sink' Japan జపాన్‌కు కిమ్ షాక్: అణుబాంబుతో సముద్రంలో కలిపేస్తాం

  సియోల్: ఉత్తరకొరియా మరోసారి జపాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. అమెరికాతో కలిసి కుట్ర చేస్తున్న జపాన్‌ను సముద్రంలో కలిపేస్తానని ఉత్తరకొరియా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది.

  షాక్: కిమ్ తల నరికేందుకు 3 వేల మంది కమెండోలు

  ఉత్తరకొరియా వ్యవహరిస్తున్న తీరుతో అమెరికా సహ ఇతర మిత్రదేశాలు భయంతో వణికిపోతున్నాయి.అణు పరీక్షలు, క్షిపణుల దాడులతో ప్రపంచదేశాలను ఉత్తరకొరియా భయబ్రాంతులకు గురిచేస్తోంది.

  ట్రంప్‌కు కిమ్ షాక్: ఆంక్షలు విధిస్తే భారీ మూల్యం తప్పదు

  ఉత్తరకొరియా ప్రపంచ దేశాల హెచ్చరికలను కూడ ఖాతరు చేయడం లేదు. దీంతో అమెరికా సూచనతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించింది.

  శాస్త్రవేత్తలకు కిమ్ విందు: అణు పరీక్షల వెనుక ఆ ఇద్దరే!

  ఈ ఆంక్షలు ఉత్తరకొరియాపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఉత్తరకొరియా కూడ అమెరికాపై విరుచుకుపడింది. అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఉత్తరకొరియా ప్రకటించింది.

  జపాన్‌ను సముద్రంలో ముంచెత్తుతాం

  జపాన్‌ను సముద్రంలో ముంచెత్తుతాం

  జపాన్‌ను సముద్రంలో ముంచెత్తుతామని ఉత్తరకొరియా హెచ్చరించింది. అమెరికాతో కలిసి జపాన్ కుట్ర చేస్తోందని ఉత్తరకొరియా జపాన్‌ను తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ఎంతో కాలం తమకు సమీపంగా జపాన్ ఉండదని ఉత్తరకొరియా వార్నింగ్ ఇచ్చింది.

  అణు బాంబుతో చిత్తు చేస్తాం

  అణు బాంబుతో చిత్తు చేస్తాం

  జపాన్‌కు చెందిన అర్చిపిలాగో నాలుగు ద్వీపాలను ఒక అణుబాంబు వేయడం ద్వారా చిత్తుచేసి సముద్రంలో ముంచేస్తామని జపాన్ హెచ్చరించింది. ఇలా చేస్తే కానీ, జపాన్ తమ దరి చేరలేదంటూ బెదిరించింది ఉత్తరకొరియా. తమను బెదిరించే దేశాల అంతు చూస్తామని ఉత్తరకొరియా వార్నింగ్ ఇచ్చింది.

  ఐక్యరాజ్యసమితిపై ఉ.కొరియా ఫైర్

  ఐక్యరాజ్యసమితిపై ఉ.కొరియా ఫైర్

  ఐక్యరాజ్యసమితిపై కూడ ఉత్తరకొరియా ఫైర్ అయింది. లంచాలు తీసుకొనే కొన్ని దేశాలు అన్ని కలిసి తమకు వ్యతిరేకంగా కుట్రల చేస్తున్నాయని ఉత్తరకొరియా ఆరోపణలు చేసింది.ఐక్యరాజ్యసమితిలో అమెరికా పెట్టిన ఆంక్షల తీర్మాణమే ఇందుకు నిదర్శనమని ఉత్తరకొరియా అభిప్రాయపడింది.

  అణు పరీక్షలకు చెక్ పెట్టేందుకే ఆంక్షలు

  అణు పరీక్షలకు చెక్ పెట్టేందుకే ఆంక్షలు

  ఉత్తరకొరియా అణుపరీక్షలు నిర్వహించకుండా అడ్డుచెప్పేందుకే ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించింది.ఉత్తరకొరియాకు బొగ్గు ఖనిజాలు, ఇంధన ఎగుమతులు ఆపేయాలని తీర్మాణం చేసింది. ఉత్తరకొరియాకు చెందిన టెక్స్ టైల్స్‌ను ఎవరు దిగుమతి చేసుకోవద్దని పేరిటీ తీర్మాణాన్ని అమెరికా ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ఆమోదం పొందింది.చైనా కూడ ఈ తీర్మాణానికి ఆమోదం తెలిపింది. దీంతో ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది.

  అమెరికాను చీకట్లో ముంచెత్తుతాం

  అమెరికాను చీకట్లో ముంచెత్తుతాం

  అమెరికాను చీకట్లో ముంచెత్తుతామని ఉత్తరకొరియా హెచ్చరించింది. అమెరికాలో మరింత భయాన్ని సృష్టించి అక్కడ కూడ చీకట్లు నిండేలా చేస్తామని హెచ్చరించింది. భద్రతామండలి అనేది దుష్టశక్తి అంటూ ఉత్తరకొరియా తిట్టిపోసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  North Korea threatened to use a nuclear weapon against Japan, further escalating tensions in North Asia after being hit with fresh United Nations sanctions earlier this week.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి