వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ద మేఘాలు: అణుదాడి వీడియోతో బెంబేలెత్తిస్తున్న కిమ్, ప్రపంచ యుద్దం తప్పదా?

అమెరికా ఆధీనంలోని గువాం ద్వీపంపై దాడులు చేస్తామంటూ ప్రకటించి.. ఆ తర్వాత వెనక్కి తగ్గిన ఉత్తరకొరియా మరోసారి దుస్సాహాసానికి ఒడిగట్టినట్లే కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్ యాంగ్: అమెరికా ఆధీనంలోని గువాం ద్వీపంపై దాడులు చేస్తామంటూ ప్రకటించి.. ఆ తర్వాత వెనక్కి తగ్గిన ఉత్తరకొరియా మరోసారి దుస్సాహాసానికి ఒడిగట్టినట్లే కనిపిస్తోంది. ఈ దఫా ఏకంగా తమ దాడి ఎలా ఉండబోతుందో తెలియపరిచేలా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ను విడుదల చేసింది.

రెండు రోజుల క్రితం గువాంపై దాడికి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ స్కెచ్ వేస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు లీకైన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో కిమ్ వెనక్కి తగ్గారు. కానీ తాజాగా దక్షిణ కొరియాతో కలిసి అమెరికా మిలిటరీ డ్రిల్ చేపట్టడంతో ఉత్తరకొరియా మరోసారి అగ్రరాజ్యాన్ని భయపెట్టేందుకు యత్నించింది.

వీడియో రూపంలో:

క్షిపణులతో గువాం ద్వీపంపై విరుచుకుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకు కట్టేలా ఓ వీడియోను విడుదల చేసింది. ఉత్తరకొరియా మీడియా ద్వారా ఈ వీడియో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 'అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమాధి సిలువలతో నిండిపోతుంది. పాపాత్ములైన అమెరికన్లకు నరకమే గతి' అంటూ వీడియోలో ఉత్తరకొరియా విరుచుకుపడింది.

కిమ్ జాంగ్‌కు రొడ్రిగో హెచ్చరిక: బొమ్మలతో ఆటలా?, పిచ్చోడా.. నువ్వో..?కిమ్ జాంగ్‌కు రొడ్రిగో హెచ్చరిక: బొమ్మలతో ఆటలా?, పిచ్చోడా.. నువ్వో..?

హవాంగ్ -14తో సర్వనాశనం:

హవాంగ్ -14తో సర్వనాశనం:

ప్రపంచంలో తామే ఉత్తమమైన అధికులమని అమెరికా మూర్ఖులు ఊహల్లో తేలుతున్నారని ఉత్తరకొరియా ఘాటుగా విమర్శించింది. తాము ప్రయోగించబోయే హవాంగ్ -14 న్యూక్లియర్ మిస్సైల్ అమెరికాను సర్వ నాశనం చేస్తుందని, అమెరికాతో తలపడేందుకు తాము అన్ని రకాలుగా సన్నద్దమవుతున్నామని ఆ దేశం ప్రకటించింది.

యుద్దమే! సిద్దంగా ఉండాలంటూ సైన్యానికి కిమ్ ఆదేశం: కొరియన్ వార్-2 దిశగా..యుద్దమే! సిద్దంగా ఉండాలంటూ సైన్యానికి కిమ్ ఆదేశం: కొరియన్ వార్-2 దిశగా..

ఐరాస జోక్యంతో తగ్గి:

ఐరాస జోక్యంతో తగ్గి:

ఉత్తరకొరియాతో యుద్దానికి అగ్రరాజ్యం అమెరికాకు ప్రపంచ దేశాల అండ లభిస్తోంది. అటు ఐరాస కూడా ఇప్పటికే ఉత్తరకొరియా విధానాలను నిరసిస్తూ దౌత్య పరంగా ఆ దేశానికి బుద్ది తెచ్చేలా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే చైనాను హెచ్చరించి మరీ ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఆంక్షలు విధించింది.

అమెరికాపై మొదటి బాంబు ఉత్తరకొరియా వేస్తే ఆ దేశానికే తాము సహకరిస్తామని ప్రకటించిన చైనా.. ఐరాస ఒత్తిడితో కాస్త వెనక్కి తగ్గింది. మిత్ర దేశం చైనా అండ లేకపోవడంతో.. ఉత్తరకొరియా కూడా గువాంపై ఇప్పట్లో దాడి చేయమని ప్రకటించింది.

ఉ.కొరియా వెనుక ఆ దేశం: అమెరికాకు ఊహించని షాక్?, ద్వంద్య నీతికి పరాకాష్ఠ!ఉ.కొరియా వెనుక ఆ దేశం: అమెరికాకు ఊహించని షాక్?, ద్వంద్య నీతికి పరాకాష్ఠ!

ప్రపంచ యుద్దం తప్పదా?

ప్రపంచ యుద్దం తప్పదా?

నిజానికి ఉత్తరకొరియాకు రష్యా రహస్యంగా సహకరిస్తుందన్న అనుమానం అమెరికాకు ఉంది. స్వయంగా క్షిపణులను తయారుచేసుకునేంత సామర్థ్యం ఉత్తరకొరియాకు లేదని అమెరికా నమ్ముతోంది. ఉక్రెయిన్ లోని ఓ ఫ్యాక్టరీలో రష్యా సహకారంతో ఉత్తరకొరియా క్షిపణి తయారీ జరుగుతోందని అమెరికా భావిస్తోంది.

మరోవైపు యుద్ద పరిస్థితులు వస్తే.. తానే స్వయంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తో చర్చలు జరుపుతానని రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలో ప్రకటించారు. అలాంటి పుతిన్ తెరవెనుక ఈ తతంగం నడుపుతున్నారని తేలితే అది ద్వంద్వ నీతే అవుతుంది.

అయితే అమెరికాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఉత్తరకొరియాకు రష్యా సహకారం అందిస్తుందా? అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తున్న అంశం. అదే జరిగితే చైనా కూడా రష్యాతో జత కలిసి అవకాశం ఉంది. అప్పుడీ మొత్తం వ్యవహారం మరో ప్రపంచ యుద్దానికి దారి తీసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

English summary
North Korea is again threatening the total annihilation of Guam, this time doing so with a video that shows a simulated attack on the U.S. territory, reports Gizmodo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X