ట్రంప్‌కు కిమ్ షాక్: ఆంక్షలు విధిస్తే భారీ మూల్యం తప్పదు

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యాంగ్యాంగ్: వరుసగా అణు పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తరకొరియాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించాలనే నిర్ణయంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని కిమ్ హెచ్చరించారు.

కిమ్‌కు షాక్: జపాన్, అమెరికా జెట్ డ్రిల్స్, తాజా పరిస్థితులపై ట్రంప్ ఆరా

ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించినా ఐక్యరాజ్యసమితి ఆదేశాలను కూడ బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా వరుసగా అణు పరీక్షలు నిర్వహించింది. వరుసగా 6 దఫాలు అణుపరీక్షలు చేసింది.

శాస్త్రవేత్తలకు కిమ్ విందు: అణు పరీక్షల వెనుక ఆ ఇద్దరే!

పది రోజుల క్రితం ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. హైడ్రోజన్ బాంబు పరీక్షించిన తర్వాత ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ అనుసరిస్తున్న వైఖరితో అమెరికా సహ ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.

కిమ్‌కు షాక్: సైనిక చర్యకు రెఢీ, ఉ.కొరియాపై ట్రంప్ నిప్పులు

దీంతో ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఆంక్షల వల్ల ప్రయోజనం ఉండదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు.

అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సిందే

అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సిందే

అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ హెచ్చరించారు. వరుసగా అణుపరీక్షలు నిర్వహించడంతో ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అమెరికా నిర్ణయింయింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి అమెరికా ఓ డ్రాఫ్ట్‌ను సమర్పించింది. దీనిపై ఉత్తరకొరియా తీవ్రంగా మండిపడింది.

అమెరికా ఆత్మరక్షణలో పడింది

అమెరికా ఆత్మరక్షణలో పడింది

తమ దేశం బలాన్ని చూసి అమెరికా ఆత్మరక్షణలో పడిందని ఉత్తరకొరియా అభిప్రాయపడింది. ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా ప్రయత్నించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది ఆ దేశ విదేశాంగ శాఖ. తమ దేశాన్ని చూసి అమెరికా భయపడుతోందని అభిప్రాయపడింది ఉత్తరకొరియా.

హరికేన్లు కాదు మేం ముంచెత్తుతాం

హరికేన్లు కాదు మేం ముంచెత్తుతాం

అమెరికాను ముంచెత్తేది హరికేన్లు కావని ఉత్తరకొరియా ప్రకటించింది. అమెరికాను వరుస చర్యలతో అంతకు పదింతలు శక్తివంతమైన చర్యలతో ముంచెత్తనున్నట్టు ఉత్తరకొరియా ప్రకటించింది. అమెరికా ప్రతిపాదించిన ఆంక్షలపై ఐక్యరాజ్యసమితి ఏ నిర్ణయం తీసుకొంటోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఆంక్షల వల్ల ప్రయోజనం ఉండదన్న రష్యా

ఆంక్షల వల్ల ప్రయోజనం ఉండదన్న రష్యా

ఉత్తరకొరియాపై అంక్షలు విధించడం వల్ల ప్రయోజనం ఉండదని ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. దౌత్యపరమైన పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉందని పుతిన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాత్రం ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Korea warned on Monday the United States would pay a “due price” for spearheading a U.N. Security Council resolution against its latest nuclear test, as Washington presses for a vote on a draft resolution imposing more sanctions on Pyongyang.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X