మాజీ ప్రేయసికి కీలక పదవి కట్టబెట్టిన ఉత్తరకొరియా కిమ్

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యాంగ్‌యాంగ్‌ : ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కొద్దిరోజులుగా అధికార పార్టీలో భారీ మార్పులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే తన చెల్లెలు కిమ్ యో జాంగ్ ను పార్టీ పోలిబ్యూరోలోకి తీసుకున్న కిమ్ తాజాగా తన మాజీ ప్రేయసిని కూడా అందలమెక్కించారు.

కిమ్ జాంగ్ ఉన్ మాజీ ప్రేయసి పేరు హ్యోన్‌ సాంగ్‌ వోల్‌. తాజాగా ఉత్తరకొరియా అధికార వర్కర్స్‌ పార్టీ సెంట్రల్ కమిటీలోకి ఈమెను కూడా కిమ్‌ ప్రమోట్‌ చేశారు. హ్యోన్‌ గతంలో మోరాన్‌బాంగ్‌ పట్టణానికి నాయకురాలిగా పని చేశారు.

North Korean dictator Kim Jong Kim promotes 'executed' ex-girlfriend to top job

అంతకుముందు ఓ ఫీమేల్‌ పాప్‌ బ్యాండ్‌ను ఆమె లీడ్‌ చేశారు. ఈ సమయంలోనే కిమ్‌.. హ్యోన్‌తో ప్రేమలో పడ్డారు. అయితే 2013లో హ్యోన్‌ సాంగ్‌ వోల్‌ పై ఆమె కుటుంబసభ్యులు చూస్తుండగానే ఫైరింగ్ స్వ్కాడ్ కాల్పులు జరిపింది.

తన శృంగార కాలాపాలను సెక్స్ టేపులుగా మార్చి అమ్మజూపిందనేది ఆమెపై ప్రధాన ఆరోపణ. ఈ ఘటనలో ఆమె చావునుంచి తప్పించుకుంది. మరోవైపు తన సన్నిహితులకు అధికార పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు కూడా కిమ్ పై వస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The North Korean dictator Kim Jong-Uns former pop-star girlfriend, who was falsely rumoured to be executed after creating a sex-tape, has been promoted to a powerful position in the government's inner circle. Hyon Song-wol, the former lead singer of all-girl band Moranbong – known for propaganda songs – was appointed to the Workers Party's Central Committee on Saturday. In 2013, rumours of Hyon been reportedly shot by firing squad in front of her family circulated on the net. She was accused of filming herself during sex and selling tapes, a breach of North Korean laws.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి