Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kim Jong Un Viral Video: కిమ్ జోంగ్ ఉన్ ఎంతలా చిక్కిపోయాడో చూడండి...

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బరువు తగ్గి స్లిమ్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం వల్ల కిమ్ జోంగ్ చిక్కిపోయారా... లేక ఫిట్‌గా ఉండటం కోసం కావాలనే బరువు తగ్గారా అన్న విషయంలో క్లారిటీ లేదు. సాధారణంగా అక్కడి మీడియాపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ఏ విషయమూ అంత తేలిగ్గా బయటకు రాదు.కాబట్టి కిమ్ బరువుకు సంబంధించిన చర్చపై ఉత్తర కొరియా నుంచి స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. తాజాగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌కి సంబంధించి ఓ వీడియో బయటకొచ్చింది... కిమ్‌ ఎంతలా చిక్కిపోయారో అందులో స్పష్టంగా కనిపిస్తోంది.

వదులైన దుస్తులతో కనిపించిన కిమ్...

వదులైన దుస్తులతో కనిపించిన కిమ్...

ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశానికి సంబంధించిన వీడియోను అక్కడి అధికారిక మీడియా ఇటీవల టీవీలో ప్రసారం చేసింది. గ్లోబల్ మీడియా రాయిటర్స్ ద్వారా ఈ వీడియో బయటి ప్రపంచం దృష్టికి వచ్చింది. ఆ వీడియోను గమనిస్తే... అందులో కిమ్ జోంగ్ ఉన్ పూర్తిగా చిక్కిపోయి కనిపిస్తున్నారు. గతంలో ఆయన ఫోటోలు,వీడియోల్లో బిగుతైన దుస్తులతో కనిపించేవారు.తాజా వీడియోలో ఆయన వదులైన దుస్తులతో కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆవేదన చెందుతున్న ప్రజలు...

కిమ్ జోంగ్ ఉన్‌ చిక్కిపోవడంపై అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధికారిక మీడియా ద్వారా ప్రసారమైన ఆయన వీడియోని చూసి వారు ఒకింత షాక్ తిన్నారు. కిమ్ జోంగ్ ఉన్ బరువు తగ్గడం గురించి అక్కడి ప్రజలకు కూడా పెద్దగా వివరాలేమీ తెలియవు. బయటి ప్రపంచం లాగే వారు కూడా కిమ్ జోంగ్ ఉన్‌కి ఏమైందోనని ఆరా తీస్తున్నారు.బహుశా కిమ్ జోంగ్ హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతుండొచ్చునన్న కథనాలు వెలుగుచూస్తున్నాయి.

గుండె సంబంధిత సమస్య...?

గుండె సంబంధిత సమస్య...?

కిమ్ జోంగ్ ఉన్ ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు. కొద్ది నెలల క్రితం వరకు ఆయన బరువు 140 కేజీలు. ఇప్పుడు కిమ్ జోంగ్‌ని చూస్తే దాదాపు సగం బరువు తగ్గారేమో అనిపించకమానదు. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ II 2011లో తీవ్ర గుండెపోటుతో మరణించారు. కిమ్ జోంగ్ ఉన్ చైన్ స్మోకర్ కావడంతో ఆయనకు కూడా గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కిమ్ బరువు తగ్గడానికి ఇదే కారణమై ఉండొచ్చునని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

ఇటీవల వర్కర్స్ పార్టీ సమావేశం...

ఇటీవల వర్కర్స్ పార్టీ సమావేశం...

ఇటీవల కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షతన వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశం జరిగింది. తాజాగా బయటకొచ్చిన వీడియో బహుశా ఆ సమావేశానికి సంబంధించినదే కావొచ్చునని తెలుస్తోంది. ఉత్తర కొరియా ఆర్థిక పరిస్థితులు,ఆహార కొరతపై ఆ సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్ చర్చించారు. తుఫాన్లు,వరదల కారణంగా ఈ ఏడాది అక్కడ పంటలు సరిగా పండకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీంతో దేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని... దీన్ని అధిగమించేందుకు మార్గాలు వెతకాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+