నా టేబుల్ మీదా బటన్ ఉంది, అంతకంటే పెద్దది: కిమ్ జాంగ్‌కు ట్రంప్ ధీటైన కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: నా టేబుల్ పైనే న్యూక్లియర్ బాంబు బటన్ ఉందని, అది నొక్కితే బుగ్గిపాలేనని హెచ్చరించిన ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్‌కు అమెరికా అద్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. నా డెస్క్‌లోను న్యూక్లియర్ బాంబ్ ఉందని హెచ్చరించారు.

నీ వద్ద ఉన్న న్యూక్లియర్ బాంబు బటన్ కంటే తన వద్ద ఉన్నది మరింత పెద్దది అని చెప్పారు. అంతేకాకుండా ఉత్తర కొరియా వద్ద ఉన్న న్యూక్లియర్ బాంబు కంటే శక్తిమంతమైనదని ట్రంప్ ఈ మేరకు ట్వీట్ చేశారు. కిమ్ జాంగ్‌కు ఆయన మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు.

 కిమ్ గుర్తుంచుకో.. ట్రంప్ ట్వీట్

కిమ్ గుర్తుంచుకో.. ట్రంప్ ట్వీట్

'కిమ్.. నీ టేబుల్ మీద ఉండే న్యూక్లియర్ బటన్ కన్నా పెద్దది, అంతకన్నా శక్తిమంతమైన న్యూక్లియర్ బటన్ నా టేబుల్ మీద ఉంది' అని, గుర్తుంచుకోవాలని కిమ్‌కు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా ఉత్తర కొరియా, అమెరికాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. యుద్ధ మేఘాలు కూడా కనిపించిన సందర్భాలు ఉన్నాయి.

  US Envoy Nikki Haley over North Korea కిమ్ జాంగ్ కు యుద్దం ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు
   గంటల్లోనే కిమ్ ఆదేశాలు

  గంటల్లోనే కిమ్ ఆదేశాలు

  అదే సమయంలో ఉత్తర కొరియా వరుస అణు పరీక్షలతో ప్రపంచాన్ని వణికించింది. ట్రంప్ ట్వీట్ వెలువడిన కొన్ని గంటల్లోనే అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని రూపొందించాలని సైంటిస్టులకు కిమ్ జాంగ్ ఉన్న ఆదేశాలు జారీ చేసినట్లు కూడా వచ్చాయి.

   కొన్నాళ్లుగా ప్రయోగాలు

  కొన్నాళ్లుగా ప్రయోగాలు

  ఉత్తర కొరియా గత ఏడాది అణు బాంబులతో పాటు హైడ్రోజన్ బాంబును కూడా పరీక్షించింది. అమెరికా, దాని మిత్ర దేశాలు తమను భయపెడుతూ సైనిక విన్యాసాలు నిర్వహించినంత కాలం అణు కార్యక్రమాలు కొనసాగిస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది.

   కిమ్ సందేశం

  కిమ్ సందేశం

  కాగా, కొత్త సంవత్సరం 2018 ఆరంభంలోనే కిమ్.. అమెరికాకు ఘాటైన హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. నా టేబుల్‌పై ఎప్పుడూ ఒక బటన్‌ ఉంటుందని, అది నొక్కితే అంతా బుగ్గిపాలేనని, అది న్యూక్లియర్‌ వెపన్‌ అని కిమ్ జంగ్ ఉన్ ప్రకటించారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తమ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచదేశాలకు హెచ్చరిక చేశారు కిమ్. తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకొనేది లేదని కిమ్ ఈ సందేశం పంపించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Nuclear button on my desk is 'much bigger' than yours, Trump warns Kim Jong, Donald Trump warns Kim Jong un America's nuclear button is much biggar than north korea, My Nuclear Button Bigger than Yours, My nuclear button is a much bigger & more powerful one.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి