మోడీ చేతల మనిషి: ఒబామా, నా రెండో పుట్టిల్లు: సూకీ
నేపిటా: భారత ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు. మయన్మార్‌లో ఆసియాన్-తూర్పు ఆసియా దేశాల సదస్సులలో ఒబామా కొద్దిసేపు మోడీతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీని ‘చేతలమనిషి'గా ప్రశంసించినట్టు విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. మోడీ- ఒబామా గత 45 రోజుల్లో కలవడం ఇది రెండోసారి.
సెప్టెంబర్‌లోఅమెరికా వెళ్లినపుడు మోడీకి కూడా ఒబామా ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆసియాన్ - తూర్పు ఆసియా సదస్సుకు హాజరైన దేశాధినేతలకు మయన్మార్ అధ్యక్షుడు తెయినసెయిన్ ఇచ్చిన విందు సందర్భంగా మోడీ, ఒబామా కలుసుకున్నారని అక్బరుద్దీన్ తెలిపారు.

ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ థాయ్‌లాండ్ ప్రధాని జనరల్ ప్రయుత్ చాన్ దొ చతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా థాయ్ ప్రధాని, మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ప్రశంసించారు. థాయ్‌లాండ్ ఆర్థిక అభివృద్ధి కోసం కూడా ఈ నినాదాన్ని అన్వయించుకుంటామన్నారు.
భారత్ రెండో పుట్టిల్లు: సూకీ
మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత అంగ్‌సాన్ సూకీతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌పై తన అభిమానాన్ని సూకీ మరోసారి వ్యక్తంచేశారు. విద్యాబుద్ధులు నేర్పిన భారత్ తనకు రెండో పుట్టిల్లని చెప్పారు. తల్లి భారత్‌లో మయన్మార్ రాయబారిగా ఉన్నపుడు సూకీ ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసేదాకా ఆమెతోపాటే ఉన్నారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం సూకీ పాతికేళ్లుగా సైనిక ప్రభుత్వంతో పోరాడుతున్నారు.
ఇదిలావుంటే, ట్విట్టర్లో ఎప్పటికప్పుడు తన సమాచారాన్ని పోస్ట్ చేసే ప్రధాని మోడీ ‘ఇన్‌స్టాగ్రామ్' ఖాతా తెరిచారు. ఆసియాన్, తూర్పు ఆసియాదేశాల సదస్సులో ఉన్న ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘తొలి' ఫొటోను బుధవారం పోస్టు చేశారు. ‘హెలో వరల్డ్! ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండడం గొప్పగా ఉంది! ఇది నేను పోస్టు చేస్తున్న తొలి ఫొటో' అంటూ ట్విట్టర్లో సందేశం పెట్టారు. 25వ ఆసియాన్ సదస్సు కోసం ఏర్పా టు చేసిన ఓ భారీ హోర్డింగ్ వద్ద దిగిన ఫొటోను ఆయన ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేశారు.
కాగా, ఆయన తన తొలి ఫొటో పోస్టు చేసిన గంటలోనే 38 వేల మంది ఫాలోయర్లు దానికి లైక్ కొట్టేశారు. మయన్మార్‌లో బిజీబిజీగా గడుపుతున్న ప్రధాని మోదీ రెండు నిమిషాలపాటు యువ సంగీతకారుడి జైలోఫోన్ సంగీతాన్ని వింటూ సేదతీరారు.












Click it and Unblock the Notifications