coronavirus impact covid 19 Coronavirus india chinese us president donald trump కరోనా వైరస్ కోవిడ్ 19 ఇండియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
కరోనా కలవరం: అమెరికా అధ్యక్ష సిబ్బందికి వైరస్, మరోసారి పరీక్ష చేయించుకునేందుకు ట్రంప్ మొగ్గు
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండుసార్లు పరీక్ష చేసుకున్నారు. అయితే నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ట్రంప్ సిబ్బంది ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో ట్రంప్ సహా సిబ్బంది ఉలికిపాటుకు గురయ్యారు.
అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా మెలిగే ఎలైట్ మిలిటరీకి చెందిన ఒకరికి కరోనా వైరస్ సోకింది. అతను ట్రంప్ ఫ్యామిలీకి సన్నిహితంగా మెలిగేవాడు. విషయం తెలిసిన వెంటనే ట్రంప్ ఆందోళనకు గురయ్యారు. మరోసారి తాను పరీక్ష చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష సిబ్బందికి ఒకరికి కరోనా వైరస్ సోకిందని వైట్ హౌస్ ధృవీకరించింది.

ఇప్పటికే అధ్యక్షుడు, ఉపాధ్యక్సుడు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారని.. నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే అతను ఎవరనే వివరాలు తెలియరాలేదు. కానీ అతనికి వైరస్ సోకిందని మాత్రం బుధవారం గుర్తించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు సమావేశమయ్యేవారిని.. వారానికోసారి పరీక్షిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
కరోనా వైరస్ గురించి భయపడటం లేదు అని.. తనతో సన్నిహితంగా మెలిగేవారికి పరీక్షలు చేయిస్తున్నామని ట్రంప్ ఇదివరకే పేర్కొన్నారు. వారానికోసారి పరీక్షలు చేస్తున్నారని.. ఇందులో ఎయిర్ ఫోర్స్ వన్ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. కరోనా వైరస్ పరీక్స సులభం అని.. కేవలం 5 నిమిషాల్లో పరీక్ష ఫలితం వస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే తాను మరోసారి టెస్ట్ చేయించుకోవాలని అనుకుంటున్నానని తెలిపారు.