వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9/11దాడి: 13ఏళ్ల తర్వాత వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఓపెన్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని ట్విన్ టవర్స్‌ను 9/11 దాడిలో ధ్వంసం చేసిన 13ఏళ్ల తర్వాత నిర్మించిన ఎత్తైన వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ సోమవారం ప్రారంభమైంది. ఇది వినియోగదారులకు స్వాగతం పలుకుతోందని ఈ మేరకు పబ్లిషింగ్ గ్రూప్ కొండే నాస్ట్ పేర్కొంది. 175మంది ఎగ్జిక్యూటివ్‌లతో కూడిన గ్రూప్, ది న్యూయార్కర్, వ్యానిటీ ఫెయిర్ లాంటి మేగజైన్లలో కథనాలను ప్రచురితం చేసింది.

స్మారక స్థూపం, మ్యూజియంను ఏర్పాటు చేసిన ట్విన్ టవర్స్ చోటుకు కొంతదూరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను నిర్మించారు. 2011, సెప్టెంబర్ 11న ఆల్‌ఖైదా ఉగ్రవాదులు ఓ విమానాన్ని హైజాక్ చేసి మ్యాన్‌హట్టన్‌లోని ట్విన్ టవర్స్‌ను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 3వేల మంది ప్రజలు మృత్యువాతపడ్డారు. ఉగ్రవాదులు పెంటాగాన్‌ను కూడా లక్ష్యం చేసుకుని దాడులు చేశారు.

ప్రస్తుతం నిర్మించిన టవర్‌లో ఐదు టవర్లు ఉన్నాయి. ఇందులో 104 స్టోర్లు, 1,776ఫీట్(540 మీటర్లు) పొడవు, ఎత్తులను కలిగి ఉండటాన్ని బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన గుర్తుగా ప్రకటించారు. నూతన నిర్మించిన టవర్లను చూసిన కొందరు ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారని కాండె నాస్ట్ పాలసీస్ డైరెక్టర్ జాన్ డుఫ్పీ తెలిపారు.

One World Trade Center opens for business 13 years after 9/11

1980లలో జాన్ డుఫ్పీ నాటి వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో విధులు నిర్వహించారు. మళ్లీ సెప్టెంబర్ 11 లాంటి ఘటనలు చూడదలచుకోలేదని కొందరు ప్రజలు ఈ భవనాన్ని చూసి నిరాశకు గురయ్యారని చెప్పారు. విధ్వంసాలను తట్టుకునే విధంగా ఈ భవనాలను నిర్మించామని డుఫ్పీ చెప్పారు.

జనవరి వరకు 3,400మంది ఉద్యోగులు 20 నుంచి 44 ఫోర్లను కలిగి ఉంటారని కాండె నాస్ట్ అంచనా వేస్తోంది. అర్కిటెక్ట్ డేవిడ్ చిల్డ్స్.. వన్ వరల్డ్ ట్రేన్ సెంటర్‌కు డిజైన్ చేశారని పేర్కొంది. టవర్లలో అద్దాలతో పలు తలుపులు చేయించినట్లు చెప్పారు. ఇవి సూర్యుని వెలుతురులో భవనాన్ని మరింత కాంతివంతంగా తయారు చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ సంస్థ అయిన పోర్ట్ ఆథారిటీ ఆధీనంలో ఉన్న ఈ భవనం దుర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.

దుర్ట్స్ సంస్థ అధికార ప్రతినిధి బోరోయిట్జ్ మాట్లాడుతూ.. ఈ టవర్లలో 60శాతం అద్దెకు వెళ్లిపోయిందని చెప్పారు. పోలీసుల భద్రతలో ఈ భవనం ఉంటుందని చెప్పారు. అన్ని రకాల సదుపాయాలు ఇందులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

English summary
One World Trade Center, Americas tallest building, on Monday welcomed its first tenants, publishing group Conde Nast, in a symbolic moment 13 years after the 9/11 attacks that brought down the original Twin Towers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X