కరోనావైరస్ మహమ్మారి అంతం అప్పుడే: డబ్ల్యూహెచ్ఓ చీప్ టెడ్రోస్ అధానమ్ తేల్చేశారు

బెర్లిన్: కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని ఎప్పుడు వీడుతుందనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న మహా పెద్ద ప్రశ్న. అయితే, కరోనా మహమ్మారిని పారద్రోలడం మన చేతుల్లోనే ఉందని అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). మన వైద్యారోగ్య సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకునేప్పుడే మహమ్మారిని అంతం చేయొచ్చని జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ వెల్లడించారు.

వేరుపడి కరోనాను అంతం చేయలేం: డబ్ల్యూహెచ్ఓ

వేరుపడి కరోనాను అంతం చేయలేం: డబ్ల్యూహెచ్ఓ

కరోనా మహమ్మారి అంతానికి మనం చాలా దూరంలో ఉన్నామని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యమనేది సంపన్నులకు లగ్జరీ కాదని కరోనా మహమ్మారి నిరూపించిందన్నారు. ఇది మనిషి ప్రాథమిక హక్కు అని, ఏ దేశం కూడా ప్రపంచం నుంచి వేరుపడి మహమ్మారిని అంతం చేయలేదన్నారు. అంతేగాక, ఇతర దేశాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేయకుండా.. తమ పౌరులను కాపాడుకోలేవని టెడ్రోస్ అన్నారు.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand
    కరోనా తగ్గినట్లు కనిపించినా..

    కరోనా తగ్గినట్లు కనిపించినా..

    ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా.. తాజాగా కొన్ని దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయని టెడ్రోస్ తెలిపారు. కరోనావైరస్ పుట్టిన చైనాలో మళ్లీ కేసులు భారీగా పెరుగుతున్నాయని టెడ్రోస్ తెలిపారు. మరోవైపు, బ్రిటన్, రష్యాల్లోనూ కరోనా ఉధృతి ఎక్కువగానే ఉందన్నారు. భారతదేశంలో మాత్రం కరోనా వైరస్ అదుపులో ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే, కరోనా నిబంధనలు, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోకుంటే మళ్లీ కేసులు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండగల సీజన్, రాజకీయ సమావేశాల నేపథ్యంలో ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+