ప్రేయసి హత్య కేసులో పిస్టోరియస్ దోషి: తేల్చిన కోర్టు

ప్రణాళిక ప్రకారం హత్య చేశాడన్న కేసులో పిస్టోరియస్ నిర్దోషి అని అని గురువారం ప్రకటించిన న్యాయస్థానం.. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి హత్య చేసినందుకు శుక్రవారం పిస్టోరియస్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఘటన జరిగిన సమయంలో పిస్టోరియస్ గన్ ఉపయోగించడంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడని కోర్టు పేర్కొంది.
పిస్టోరియస్ నిరుడు ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి తన ప్రియురాలు రీవాను కాల్చి చంపాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఆమెను హత్య చేయలేదని, ఇంట్లోకి ఎవరో ఆగంతకులు చొరబడ్డారని భ్రమపడి జరిపిన కాల్పుల్లో ఆమె మృతి చెందిందని పిస్టోరియస్ వాదించిన విషయం తెలిసిందే.
కాగా, రీవా హత్య కేసులో పిస్టోరియస్‌కు దాదాపు 15సంవత్సరాలకు పైగా జైలు శిక్షపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు శిక్షను ప్రకటించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications