విషాదం:పెళ్ళిరోజును సెలబ్రేట్ చేసుకొనేందుకు వెళ్ళి మృత్యుఒడిలోకి....

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్:పెళ్ళిరోజును ఘనంగా జరుపుకోవాలని భావించిని ఆ దంపతులకు ఊహించని విషాదం ఎదురైంది. బ్రిటన్ పార్లమెంట్ పై జరిగిన దాడిలో భర్త మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది.

బ్రిటన్ పార్లమెంట్ లక్ష్యంగా మినిస్టర్ బ్రిడ్జిపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది బుదవారం నాడు సాగించిన దాడిలో కర్త్ కొక్రన్ అనే అమెరికా పౌరుడు మరణించాడు. ఆయన భార్య మిలిసా తీవ్రంగా గాయపడింది.వీరిద్దరికి వివాహమై 25 ఏళ్ళైంది.అయితే వారి వివాహ వార్షికోత్సవ వేడుకలను లండన్ లో జరుపుకోనేందుకు వెళ్ళి ప్రాణాలమీదికి తెచ్చుకొన్నారు.

Our Family Is Heartbroken': American Killed In London Attack Was Celebrating Wedding Anniversary

అమెరికాలోని ఉతాహ్ ప్రాంతానికి చెందిన ఈ దంపతులు లండన్ కు రావడమే వారి ప్రాణాల మీదికి వచ్చింది.వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపై ఉగ్రవాది కారుతో దూసుకురావడంతో గాయాలపాలైన కార్త్ చనిపోయాడు. మిలిసా సోదరి సారా పేనేమక్ ఫర్లాండ్ చెప్పారు.తన సోదరి చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతోందని ఆమె వివరించారు.

మిలిసా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. మా గుండె పగిలింది. మరో చావును చూడడానికి సిద్దంగా లేమన్నారు.మాకెంతో ఇష్టమైన బావను పోగొట్టుకొన్నామన్నారు.కర్త్ నువ్వు నిజమైస హీరోవి, నిన్ను ఎప్పటికీ మర్చిపోమని సారా తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది.కర్త్ మృతి తమను ఎంతగానో కలిచివేసిందని మిలిసా సోదరుడు క్లింట్ పేనె చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This week was supposed to be a chance to celebrate their anniversary, as well as a chance for Kurt and Melissa Cochran to visit Melissa's parents, who work on a Church of Jesus Christ of Latter-day Saints mission in England.
Please Wait while comments are loading...