షాక్: పవిత్ర పర్వతంపై.. నగ్నంగా ఫొటో దిగిన ప్లేబాయ్ మోడల్, మండిపడుతున్న గిరిజనం

Posted By:
Subscribe to Oneindia Telugu

వెల్లింగ్టన్: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పోస్ట్ చేయ‌డం చాలామందికి ఓ స‌ర‌దా. ఇక మోడ‌ళ్ల‌కు అయితే అది వారి దినచర్యలో భాగం. కానీ ప్లేబాయ్ మోడ‌ల్ జేలీన్ కుక్‌ పోస్ట్ చేసిన ఓ ఫోటోపై మాత్రం వివాదాస్పదమైంది.

న్యూజిలాండ్‌లో ఉన్న మౌంట్ తార‌నాకిపై మోడ‌ల్ కుక్ ఓ న్యూడ్ ఫోటో దిగింది. దాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు క్ష‌ణాల్లో వేల లైక్‌లు వ‌చ్చాయి. కానీ స్థానిక మ‌వోరి గిరిజ‌న జాతి ప్ర‌జ‌లు మాత్రం దీనిపై తీవ్ర నిరసన వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌వోరి జాతి ప్ర‌జ‌లు మౌంట్ తార‌నాకిని ప‌విత్ర ప‌ర్వ‌తంగా భావిస్తారు. బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి కొన్ని రోజుల క్రితం ప‌ర్వ‌తం ఎక్కిన కుక్ ఈ ఫోటోను దిగింది. ప‌విత్రంగా భావించే పర్వ‌తాన్ని అమ‌ర్యాద‌గా చిత్రీక‌రించ‌డం స‌రిగాలేద‌ని మ‌వోరి ప్ర‌జ‌లు అంటున్నారు.

Outrage in New Zealand as Playboy model poses NAKED on top of sacred Mt Taranaki

వాస్త‌వానికి మౌంట్ తార‌నాకి ఓ అగ్ని ప‌ర్వ‌తం. మ‌వోరిలు దీన్ని పూజిస్తారు. త‌మ పూర్వీకుల స‌మాధిగా ఈ ప‌ర్వ‌తాన్ని మ‌వోరీలు భావిస్తారు. అసలు ప‌ర్వ‌తం పైకి ఎక్క‌డం కూడా అక్క‌డ నిషేధ‌మే.

అలాంటిది ఆ పర్వతంపైకి ఎక్కడమేకాకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా నగ్నంగా ఫొటో దిగింది మోడల్ కుక్. అందుకే మరి స్థానిక మ‌వోరి ప్ర‌జ‌ల నుంచి ఈ స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A New Zealand Playboy playmate has come under fire for posing naked on a sacred Maori mountain. Glamour model Jaylene Cook, 25, and her photographer boyfriend Josh Shaw, 27, spent seven hours hiking up Mt Taranaki on April 26 and impulsively took the risqué shot once they reached the summit. In the nude image Ms Cook can be seen admiring the view from the top while wearing just a hat, gloves and shoes.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి