శవాల గుట్ట- విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్: వెనుక నుంచి కథ నడిపిస్తోన్న ట్రంప్?

Israel: గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌పై మరోసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డ్రోన్ దాడులతో కల్లోలాన్ని రేపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 400 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాదిమంది గాయపడ్డారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

నిజానికి- హమాస్‌తో ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇజ్రాయెల్. దీనికి ప్రతిగా ఆ మిలిటెంట్ గ్రూప్ చెరలో బందీలుగా ఉన్న తమ దేశ పౌరులను విడిపించుకోవాలనేది షరతు. దీనికి ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణను కుదుర్చుకున్నాయి.

Israel

యుద్ధాన్ని నిలిపివేయడానికి కాల్పుల విరమణ కుదిరిన రెండు నెలల తర్వాత ఈ దాడులు తెరమీదికి వచ్చాయి. ఈ రెండు నెలల వ్యవధిలో తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్లో దాదాపు 60 మందిని విడుదల చేసింది హమాస్. అలాగే- ఇజ్రాయెల్‌లో ఖైదీలుగా ఉంటోన్న రెండువేల మంది పాలస్తీనియన్లను విడుదల చేయాలనేది ఈ కాల్పుల విరమణ ఒప్పందం స్పష్టం చేస్తోంది.

ఈ పరిస్థితుల్లో తాజా దాడులు చోటు చేసుకోవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. డ్రోన్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. గాజా అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇప్పటివరకు 400 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వందలాదిమంది గాయపడ్డారు. మృతుల్లో హమాస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మహమూద్ అబూ వాఫా కూడా ఉన్నట్లు సమాచారం.

గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని స్థానిక మీడియా తెలిపింది. గాజాలోని వివిధ ప్రాంతాలను ఒకేసారి లక్ష్యంగా చేసుకుని దాడులు సాగిస్తోన్నందున సహాయక చర్యలు చేపట్టడంలో ఆటంకాలు ఎదురవుతున్నట్లు సివిల్ డిఫెన్స్ పేర్కొంది.

Donald Trump

ఈ దాడులపై ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది. హమాస్ చెరలో ఉన్న తమదేశ పౌరులను విడిపించే ప్రయత్నంలో భాగంగా హమాస్ శిబిరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడులు సాగించాయని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలియజేసింది. కాల్పుల విరమణకు బదులుగా సైనిక చర్యతోనే హమాస్ ఎదుర్కొంటొన్నామని వివరించింది.

ఈ ఏడాది జనవరి 19వ తేదీన ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ, బందీలు-ఖైదీల మార్పిడి ఒప్పందం తరువాత గాజాపై జరిగిన అతిపెద్ద దాడుల ఇవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడులు- రెండు నెలల ఒప్పందానికి ముగింపు పలికినట్టయింది.

ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికా ఉందంటూ హమాస్ ఆరోపించింది. ఈ దాడులకు ముందు నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంప్రదింపులు జరిపాడని విమర్శించింది. ఈ దాడుల గురించి ముందస్తు సమాచారం ఇచ్చిన తరువాతే గాజాపై మారణ హోమానికి తెగబడిందని ధ్వజమెత్తింది.

Take a Poll

గాజా మారణహోమానికి అమెరికా పూర్తి బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేసింది. దీనిపై తాజాగా హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ- అమానవీయంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడిందని, ఇది- అమెరికా ప్రేరేపిత దాడి అంటూ ఆరోపణలు గుప్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+