కరోనా దాటికి అమెరికా విలవిల.. 9లక్షలకు పైగా మరణాలు.. భారత్‌లో ఎన్నంటే?
కరోనా మహమ్మారి అగ్రరాజ్యాం అమెరికాను గజగజ లాడిస్తుంది. లక్షలో కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ సంభవించని మరణాలు ఒక్క అమెరికాలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్‌తో 9 లక్షల మందికి పైగా మృతి చెందారు. తర్వాత 6లక్షల మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా .. మూడో స్థానంలో భారత్ ఉంది. ఇండియాలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 5 లక్షలమందికి పైగా మృతి చెందారు.

50 రోజుల వ్యవధిలోనే లక్ష మంది మృతి
అమెరికాలో కరోనా వైరస్ ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 లక్షల మందికి పైగా మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మృతుల సంఖ్య శాన్ ఫ్రాన్సిస్కో , ఇండియానా పోలీస్, నార్త్ కరోలినాలో నివసించే జనాబా కంటే ఎక్కువ. కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి.. మళ్లీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడంతో.. వేలల్లో మరణాల సంభవించాయి. దీంతో కేవలం 50 రోజుల వ్యవధిలోనే లక్ష మంది మృతి చెందారు.

ఏప్రిల్ నాటికి మృతుల సంఖ్య 10 లక్షలు దాటే అవకాశం
గత రెండు, మూడు వారాలుగా అమెరికాలో కరోనా, ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ మరణాలు మాత్రం భారీగా నమోదవుతున్నాయి. శీతాకాలం మొదలైన నాటి నుంచి కరోనాతో సగటున రోజుకు 2,400 మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా టీకాల తీసుకున్న తర్వాత కూడా మరణాలు పెరిగాయని బ్రౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ ఆశిష్. కే. ఝా పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు, కరోనా నిబంధనలు పాటించడం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి అంతమవ్వకపోతే వచ్చే ఏప్రిల్ నాటికి మృతుల సంఖ్య 10 లక్షలు దాటే అవకాశముందని హెచ్చరించారు.

జో బైడెన్ తీవ్ర విచారం
కరోనా వ్యాప్తి, మరణాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు . ఈ కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టం .. మానసికంగా , శారీరకంగా చాలా భారమైనదని పేర్కొన్నారు. అమెరికన్లంతా తమతో పాటు తమ కుటుంబ సభ్యులను కూడా రక్షించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే వైరస్ కట్టడి సాధ్యమని తెలిపారు.
-
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications