కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది: ఆ జంతువులపై సక్సెస్, ఈ ఏడాదిలోనే...!
లండన్: ప్రపంచాన్ని కరోనావైరస్ కబళిస్తున్న వేళ ప్రపంచదేశాలు ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందేందుకు వ్యాక్సిన్‌లు కనుగొనే ప్రయత్నంలో ఉన్నాయి. అయితే ఇప్పటికే మనుషులపై ప్రయోగం చేస్తున్నామంటూ ఆక్స్‌ఫర్డ్‌లోని జెన్నర్ ఇన్స్‌టిట్యూట్ చెప్పుకొచ్చింది. తాజాగా ఈ ఇన్స్‌టిట్యూట్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని చెప్పుకొచ్చిన సంస్థ సెప్టెంబర్ నాటికల్లా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది.

సెప్టెంబర్ కల్లా వ్యాక్సిన్
చాలా దేశాల్లో తక్కువ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినప్పటికీ జెన్నర్ ఇన్స్‌టిట్యూట్ మాత్రం వ్యాక్సిన్ తీసుకొస్తామని ఇందుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇప్పటికే మనుషులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించామని చెప్పుకొచ్చిన జెన్నర్ ఇన్స్‌టిట్యూట్ ఇది మనుషులకు సురక్షితమైన వ్యాక్సిన్ అనే నిర్థారణకు వచ్చినట్లు స్పష్టం చేసింది. మే చివరినాటికి దాదాపు 6వేల మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చి ప్రయోగం చేస్తామని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ సురక్షితం అని చెప్పడమే కాకుండా కరోనావైరస్ నుంచి విముక్తి కలిగించే వ్యాక్సిన్‌గా ఇది నిలుస్తుందని వెల్లడించారు. ఇక అన్నీ సవ్యంగా జరిగి అన్ని అనుమతులు వస్తే సెప్టెంబర్ నాటికల్లా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సైంటిస్టులు చెప్పారు.

కోతుల్లో ప్రయోగం.. మంచి ఫలితాలు
ఆక్స్‌ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్‌ను గత నెలలో కొన్ని కోతులకు ఇవ్వడం జరిగిందని ఆ తర్వాత వైరస్‌కు వాటిని ఎక్స్‌పోజ్ చేశామని మాన్‌టనాస్ నేషనల్ ఇన్స్‌టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు చెప్పారు. ఈ కోతుల్లో కొన్ని అనారోగ్యంకు గురయ్యాయని చెప్పారు. అయితే 28 రోజుల తర్వాత అన్ని కోతులు తిరిగి ఆరోగ్యంతో పుంజుకున్నాయని చెప్పారు డాక్టర్ విన్సెంట్ మన్స్‌టర్. రీసస్ మకాక్ జాతి కోతులు మనిషితో దగ్గర పోలికలు కలిగి ఉంటాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం మరింత పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పిన డాక్టర్ మన్స్‌టర్.. రానున్న వారాల్లో వీటి ఫలితాలను సమీక్షకు పంపుతామని స్పష్టం చేశారు.

కోతులతో మనుషులకు పోలికేంటి..?
ఇదిలా ఉంటే చైనా కంపెనీ సైపో వాక్ మరో వాదన వినిపించింది. కోతుల్లో ఉండే వ్యాధి నిరోధక శక్తిని మనుషుల వ్యాధి నిరోధక శక్తితో పోల్చలేమని చెప్పింది. అయితే ఆక్స్‌ఫర్డ్ చేస్తున్న లేదా తీసుకొస్తున్న వ్యాక్సిన్ కోతుల్లోనే కాదు మనుషులకు కూడా పనిచేస్తుందనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. కొత్త ఇన్‌ఫెక్షన్లు మరికొన్ని రోజులు అలానే ఉండాలని కోరుకుంటున్న సంస్థలో తమది ఒకటని చెప్పారు ప్రొఫెసర్ ఆడ్రియన్ హిల్. ఎందుకంటే వ్యాక్సిన్‌ను పూర్తిస్థాయిలో పరీక్షించి ప్రయోగం చేసేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు.
Recommended Video
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications