అబ్బా: ఎం చెప్పావు ఫవాద్ ఖాన్, పాక్ పారిపోలేదా ? మరి
లాహోర్: ఊరీ ఘటన అనంతరం భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మొదటి సారి పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ సోషల్ మీడియాలో స్పందించాడు. మనం శాంతియుత ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రయత్నించాలని తెలిపాడు.
ఇద్దరు పిల్లల తండ్రిగా అందరూ కోరుకుంటున్నట్లే తాను కోరుకుంటున్నానని, శాంతియుత ప్రపంచంలో మనం అందరూ జీవించాలని కోరుకుంటున్నానని ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.
భవిష్యత్తుకు రూపమిచ్చే మన పిల్లల కోసం శాంతియుత ప్రపంచం అవసరం అని, అందు కోసం మనం పనిచెయ్యగలం అని ఆశిస్తున్నానని చెప్పాడు. భారత్-పాక్ మధ్య గత రెండు వారాలుగా సాగుతున్న ఘటనలపై ఫవాద్ ఖాన్ విచారం వ్యక్తం చేశాడు.

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించాలని మీడియా, తన అభిమానులు కోరుతున్నారని, అందుకే తాను ఈ విధంగా స్పందిస్తున్నానని ఫవాద్ ఖాన్ చెప్పాడు. ఇరు దేశాల ప్రభుత్వాలు శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని మనవి చేశాడు.
నేను పారిపోలేదు......... ఫవాద్ ఖాన్
పాక్ నటీనటులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని, లేదంటే మెడపట్టి గెట్టేస్తామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఫవాద్ ఖాన్ రహస్యంగా పాకిస్థాన్ వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఘటనపై ఫవాద్ ఖాన్ స్పందించలేదు. ఇప్పుడు తాజాగా ఫవాద్ ఖాన్ స్పందించాడు. తాను భారత్ నుంచి పారిపోలేదని అన్నాడు. తన భార్య సదాఫ్ రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్న క్రమంలోనే నేను పాక్ వెళ్లానని అంటున్నాడు.

తాను జులైలోనే పాకిస్థాన్ వెళ్లానని చెబుతున్నాడు. తనకు ఇటీవల( ఈ వారం) పండంటి పాప పుట్టిందని, భార్య సదాఫ్, పాప క్షేమంగా ఉన్నారని ఫేస్ బుక్ లో తెలిపాడు. భారత్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తలను ఫవాద్ ఖాన్ ఖండించాడు.
తనకు మద్దతుగా నిలిచి అభిమానులకు, పాక్, భారత్, ఇతర దేశాల నటీనటులకు కృతజ్ఞతలు చెబుతున్నానని ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. నిజంగా ఎంఎన్ఎస్ పాక్ నటీనటులకు వార్నింగ్ ఇచ్చిన సమయంలో ఫవాద్ ఖాన్ ముంబైలో ఉన్నాడని సమాచారం.
ఎంఎన్ఎస్ వార్నింగ్ ఇచ్చిన తరువాత అతను భారత్ నుంచి దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి పాక్ చేరుకున్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. భారతీయ సీనిమాలలో నటిస్తున్న పాక్ నటీనటుల మీద బాలీవుడ్ నిర్మాతల మండలి నిషేధం విధించింది.
నిర్మాతల మండలి నిషేధం విధించిన తరువాత ఫవాద్ ఖాన్ స్పందించడంతో పలువురు నోరు వెళ్లబెడుతున్నారు. అయితే ఊరీ ఘటనలో 19 మంది భారతీయ జవాన్లు మరణించిన విషయంపై ఫవాద్ ఖాన్ స్పందించపోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
కేవలం సంపాదన కోసం ఫవాద్ ఖాన్ భారత్ వస్తున్నాడని, మన దేశం మీద అతనికి ఎలాంటి ప్రేమ, అభిమానం లేదని అంటున్నారు. ఇలాంటి వారిని భారత్ లో అడుగుపెట్టనివ్వరాదని ఎంఎన్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications