ఉగ్రవాదుల దుశ్చర్య: కాల్పుల్లో కెప్టెన్ సహా 11 మంది సైనికుల మృతి
పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ దేశ భద్రతా బలగాలపై విరుచుకుపడ్డారు. దీంతో కెప్టెన్ సహా 11 మంది చనిపోయారు. ఖైబర్ పంక్తువా ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో కొందరు పౌరులు ఉగ్రవాదులకు బందీలుగా ఉన్నారని తెలుస్తోంది. దాంతోనే దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఉగ్రవాద దాడిలో చనిపోయిన కెప్టెన్ అబ్దుల్ బాసిత్‌గా గుర్తించారు. 11 మంది చనిపోగా.. 15 మంది సైనికులు గాయపడ్డారు. కుర్రం ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రతీకార చర్యలకు దిగింది. బాసిత్.. పాకిస్తాన్ ఆర్మీ రెస్య్కూ మిషన్‌లో పనిచేస్తారని అక్కడి మీడియా తెలిపింది.
ఆరుగురు టెలీకాం విభాగానికి చెందిన సిబ్బందిని ఉగ్రవాదులు బందీ చేశారు. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాులు చనిపోయారు. ఘటనా స్థలంలో కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది.
దాడి జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కెప్టెన్ బాసిత్ నేతృత్వంలోని బృందం గాలింపు చేపట్టిన నేపథ్యంలో టెర్రరిస్టులు సైనికులపై మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలోనే ఆర్మీకి భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications