వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొంతు పట్టుకున్నాం, కార్గిల్‌ను భారత్ ఎప్పటికీ మరవదు: ముషారఫ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరాచీ: 1999లో కార్గిల్ యుద్ధాన్ని భారత దేశం ఎప్పటికీ మరిచిపోలేదని, ఆ సమయంలో తాము భారత్ గొంతును పట్టుకున్నామని పాకిస్తాన్ మాజీ మిలటరీ నియంత పర్వేజ్ ముషారఫ్ అన్నాడు. ఆయన ఆల్ పాకిస్తానీ ముస్లీం లీగ్ పార్టీ సమావేశంలో మాట్లాడారు.

భారత్‌కు తెలియకుండా కార్గిల్ ప్రాంతానికి నాలుగు వైపుల నుండి చేరుకున్నామని చెప్పారు. తద్వారా పాక్ ఆర్మీ భారత్ గొంతును పట్టుకుందన్నారు. ముందున్న సైన్యం వెనుక సెకండ్ లైన్ ఫోర్స్ కూడా సిద్ధంగా ఉందని.. ముషారఫ్ నాటి సంఘటనను గుర్తుకు చేసుకున్నాడు.

Pak army 'caught India by throat' during Kargil war: Musharraf

భారత్‌తో పోరాడుతున్న కొందరికి ఆర్మీ స్టేటస్ ఇచ్చినట్లు చెప్పాడు. పూర్తిస్థాయి ఆర్మీ పాల్గొనకుండానే యుద్ధం జరిగిందన్నాడు. పూర్తిస్థాయి ఆర్మీ పాల్గొంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. కాబట్టి కార్గిల్ యుద్ధంలో గెలుపు భారత్‌ది కాదని.. పాకిస్తాన్‌దేనని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

1971 నాటి యుద్ధం తర్వాత పాకిస్తాన్‌తో అతిపెద్ద యుద్ధం 1999లో కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ముషారఫ్ మాట్లాడారు. 1999లో కార్గిల్ యుద్ధం మాస్టర్ మైండ్ అయిన ముషారఫ్.. ఆ దేశాన్ని తొమ్మిదేళ్లకు పైగా పాలించాడు.

English summary
Recalling the Kargil conflict, Pakistan's former military dictator General Pervez Musharraf on Sunday said the Pakistani army "caught India by throat" and that India will never forget the war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X