వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్-భారత్ బంధం ఇంకాస్త తియ్యగా -చక్కెర, పత్తి, మరో 21 వస్తువులపై నిషేధం ఎత్తివేత -మోదీకి ఇమ్రాన్ లేఖ

|
Google Oneindia TeluguNews

కొట్లాటలకు స్వస్తి చెప్పి తిరిగి దోస్తానా బాట పట్టిన భారత్, పాకిస్తాన్‌లు ఇప్పటికే సైనిక, దౌత్య ఛానెళ్లను రీఓపెన్ చేయగా, ఇప్పుడు వ్యాపార, వాణిజ్యాలను సైతం పునరుద్దరించుకుంటున్నాయి. పుల్వామా ఘటన తర్వాత రెండు దేశాల మధ్య తెగిపోయిన సంబంధాలను తిరిగి కలుపుకోవడంలో భాగంగా భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన నిషేదాన్ని పాక్ సర్కారు ఎత్తేసింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి తిరుగులేఖ రాసిన 24 గంటల్లోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

రైతు ఉద్యమంలో కీలక మలుపు -సాగు చట్టాలపై సుప్రీం కమిటీ సీల్డ్ కవర్ రిపోర్టు -ఏప్రిల్ 5న భవితవ్యంరైతు ఉద్యమంలో కీలక మలుపు -సాగు చట్టాలపై సుప్రీం కమిటీ సీల్డ్ కవర్ రిపోర్టు -ఏప్రిల్ 5న భవితవ్యం

 చక్కెర, పత్తి, మరో 21వస్తువులు..

చక్కెర, పత్తి, మరో 21వస్తువులు..

ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ నుంచి చక్కెర, పత్తి దిగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఇండియ నుంచి దిగుమతుల ఆమోదానికి సంబంధించి పాకిస్థాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోట్‌ను తయారు చేయగా, క్యాబినెట్‌కు చెందిన ఎకనామిక్ కోఆర్టినేషన్ కమిటీ (ఈసీసీ) బుధవారం జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని ప్రఖ్యాత 'డాన్' మీడియా పేర్కొంది. నిషేధం ఎత్తేసిన జాబితాలో చక్కెర, పత్తితోపాటు మరో 21 వస్తువులు కూడా ఉన్నాయిని తెలిపింది.

గండం నుంచి గట్టెక్కనున్న పాక్..

గండం నుంచి గట్టెక్కనున్న పాక్..

పాకిస్తాన్ ఆర్థిక మంత్రి హమమద్ అజహర్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఎకనామిక్ కోఆర్టినేషన్ కమిటీ (ఈసీసీ).. ఇండో-పాక్ వాణిజ్యాన్ని పునఃప్రారంభించే ప్రతిపాదనకు ఆమోదం వేసింది. పాకిస్తాన్ లో వస్త్ర పరిశ్రమలో ముడి సరుకు కొరత ఉన్నందున పత్తి, దారం ఇండియా నుంచి దిగుమతి చేసుకోవాలని, దీనికి సంబంధించి దిగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం ద్వారా వస్త్రరంగానికి మేలు జరుగుతుందని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు.. వాణిజ్య, జౌళి మంత్రిత్వ ఇన్‌చార్జిగా కూడా ఉన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సానుకూలత వ్యక్తం చేశారు. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశం గట్టెక్కడమే కాకుండా, భారత్‌లోని వస్త్రరంగానికి ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామం..

మోదీకి ఇమ్రాన్ రిప్లై లేఖ..

మోదీకి ఇమ్రాన్ రిప్లై లేఖ..

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం మన ప్రధాని మోదీకి లేఖ రాశారు. పాకిస్తాన్ డే సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల పాక్ ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఇమ్రాన్ స్పందిస్తూ.. ''పాకిస్తాన్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాసినందుకు కృతజ్ఞతలు. స్వేచ్ఛా, సామర్థ్యాలతో కూడిన స్వతంత్ర, సార్వభౌమ రాజ్యానికి ముందుచూపుతో పునాదులు వేసిన మా జాతి పితలను గుర్తు చేసుకుని, నివాళులు అర్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం...'' అని పేర్కొన్నారు. అదే సమయంలో..

ప్రధానికి లేఖలో కాశ్మీర్ అంశం..

ప్రధానికి లేఖలో కాశ్మీర్ అంశం..

ఇండియాతో పాకిస్తాన్ కూడా స్నేహాన్నే కోరుకుంటోందని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్.. పనిలోపనిగా జమ్మూకాశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ''భారత్ సహా పొరుగు దేశాలన్నిటితోనూ పాకిస్తాన్ ప్రజలు శాంతిని, పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వివాదాలు పరిష్కామైతేనే, ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్ వివాదానికి ముగింపు పలికితేనే దక్షిణ ఆసియాలో శాంతి, సుస్థిరత సాధ్యం అవుతాయి'' అని ఇమ్రాన్ వక్కాణించారు. చర్చల ద్వారానే రెండు దేశాల మధ్య స్నేహ వాతావరణం ఏర్పడుతుందన్న ఇమ్రాన్.. కరోనా మహమ్మారిపై భారత ప్రజలు అద్భుతంగా పోరాడుతున్నారంటూ కితాబు ఇచ్చారు. త్వరలోనే..

 అమెరికా జోక్యం మేరకు భారత్, పాక్ దోస్తీ!

అమెరికా జోక్యం మేరకు భారత్, పాక్ దోస్తీ!

జోబైడెన్ అధ్యక్షుడైన తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలు, కూటములతో సంబధాలను పునరుద్ధరించే పనిని వేగంగా ముందుకు తీసుకెళుతున్నారు. అందులో భాగంగా యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్థాన్‌ విషయంలో బైడెన్ భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. అఫ్గాన్ శాంతి ప్రక్రియలో భారత్, పాకిస్తాన్ లను భాగస్వాములుగా చేయాలనుకుంటోన్న అమెరికా.. ముందుగా దాయాదులు ఘర్షణ వీడాలని సూచించిందని, ఆ మేరకు యూఏఈ మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ తిరిగి దగ్గరయ్యాయని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లే, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్.. అఫ్గానిస్థాన్‌లో ఇంటా బయటా శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉందంటూ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తజికిస్థాన్‌ అధ్యక్షుడు ఎమోమలీ రెహ్మాన్‌ తో భేటీ సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. త్వరలోనే భారత్, పాకిస్తాన్ రాయబార కార్యాలయాలను కూడా రీఓపెన్ చేయబోతున్నట్లు సమాచారం.

తిరుపతి పోరు: పవన్ ఎంట్రీ ఖరారు -రత్నప్రభ కోసం ఏప్రిల్ 3న జనసేనాని పాదయాత్ర -బీజేపీలో ఫుల్ జోష్తిరుపతి పోరు: పవన్ ఎంట్రీ ఖరారు -రత్నప్రభ కోసం ఏప్రిల్ 3న జనసేనాని పాదయాత్ర -బీజేపీలో ఫుల్ జోష్

English summary
Pakistan on Wednesday allowed the country's private sector to import white sugar from India, signalling the revival of suspended trade tied between the two neighbours. The news came amidst a series of diplomatic overtures to thaw ties between the two nations. The latest decision came a day after Pakistan Prime Minister Imran Khan wrote to his counterpart Narendra Modi underlining the primacy of the Kashmir issue for Pakistan and calling for the creation of an enabling environment for "result-oriented dialogue" with India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X