గీత: మోడీ ఇస్తానన్నరూ.కోటి వద్దన్న పాక్ ఈది సంస్థ
ఢిల్లీ: భారత్‌కు చెందిన గీతను ఏళ్ల పాటు సంరక్షించిన పాకిస్తాన్‌కు చెందిన ఎన్జీవో ఈదీ ఫౌండేషన్ మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వజూపిన రూ.కోటిని తిరస్కరించింది. గత పదిహేనేళ్లుగా గీతకు ఈది ఫౌండేషన్ గీతకు ఆశ్రయమిచ్చిన విషయం తెలిసిందే.
గీత సోమవారం నాడు భారత్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ల పాటు గీతకు ఆశ్రయమిచ్చిన ఈదీ ఫౌండేషన్‌కు ప్రధాని మోడీ రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. అయితే ఈ విరాళాన్ని ఈదీ ఫౌండేషన్ సున్నితంగా తిరస్కరించింది.

ఎంతో గొప్పమనసుతో ప్రధాని మోడీ తమకు ఆర్థిక సాయం ప్రకటించారని, అయితే తమ స్వచ్ఛంద సంస్థ నియమం ప్రకారం, ఏ ప్రభుత్వం నుంచి తాము సాయం అందుకోబోమని ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్వర్ ఖజ్మీ తెలిపారు.
పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కూడా తాము ఎలాంటి నగదు సాయం తీసుకోబోమన్నారు. ప్రధాని మోడీ ప్రకటించిన ఆ విరాళాన్ని భారత్‌లోని మూగ, బధిర చిన్నారులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. పదిహేనేళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరిన భారత్‌కు చెందిన గీత స్వదేశానికి చేరుకుంది.
చిన్న వయసులో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో కూర్చుని ఉన్న మూగ, బధిర బాలిక గీతను లాహోర్ రైల్వే స్టేషన్‌లో పాకిస్థానీ రేంజర్లు కనుగొని స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఏళ్లుగా గీత కరాచీలోని ఈదీ ఫౌండేషన్ సంరక్షణలో ఉంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications