పాక్‌లోని మన ‘గీత’ను కలవండి: హెచ్‌సికి సుష్మా
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో పొరపాటున పాకిస్థాన్‌కు వెళ్లి 14ఏళ్లుగా అక్కడే ఆశ్రయం పొందుతున్న మూగ, చెవిటి అయిన భారత అమ్మాయి గీతను వెంటనే కలుసుకోవాల్సిందిగా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్‌లో భారత హైకమిషనర్‌ను కోరారు.
గీత గురించి పాకిస్థాన్ మానవహక్కుల కార్యకర్త అన్సర్ బర్నే ట్విట్టర్‌లో పేర్కొన్న నేపథ్యంలో సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించారు. అక్కడి భారత హైకమిషనరు టీసీఏ రాఘవన్‌ను వెంటనే వెళ్లి గీతను కలుసుకోవలసిందిగా కోరానని సుష్మా ట్విట్టర్‌లో వెల్లడించారు.
I have asked Indian High Commissioner to Pakistan Dr TCA Raghavan to go to Karachi with Mrs Raghavan and meet this girl. @AnsarBurney
— Sushma Swaraj (@SushmaSwaraj) August 3, 2015 దాదాపు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు లాహోర్ రైల్వేస్టేషన్‌లో ఎటువెళ్లాలో తెలీక తిరుగుతున్న మాట్లాడలేని అమ్మాయిని పంజాబ్ రేంజర్స్ సైనికులు చేరదీసి కరాచీలోని ఓ ఫౌండేషన్‌కు అప్పజెప్పిన ఉదంతం తాజాగా సామాజిక వెబ్‌సైట్లలో విస్తతమైన సంగతి తెలిసిందే.
సామాజిక కార్యకర్త అన్సార్ బర్మీ ట్వీట్‌కు స్పందించి, పాక్ హైకమిషనర్ టీసీఏ రాఘవన్‌ను కరాచీకి వెళ్లి గీతను కలిసి వివరాలు సేకరించి ఆమె కుటుంబం జాడను కనుక్కోండని కోరినట్లు సుష్మా ట్విట్టర్‌లో వెల్లడించారు. కాగా, సుష్మాస్వరాజ్ చొరవకు అన్సార్ కతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications