ఏ మాత్రం మారని పాక్ .. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన
పుల్వామా ఉగ్రదాడి భారతదేశంలోపెను విషాదాన్ని నింపింది. భారతీయులలో ఆగ్రహావేశాలను మేల్కొలిపింది. ప్రతి ఒక్కరిలో పౌరుషాన్ని తట్టి లేపింది. దేశం మొత్తం ఏకతాటిమీదకు వచ్చి ప్రతీకారం తీర్చుకో వలసిందే అని నినదించింది. ఉగ్రదాడి జరిగిన తరువాత సమయం కోసం వేచి చూసిన భారత్ ఈరోజు తెల్లవారుజామున మెరుపు దాడికి దిగింది. 12 మిరేజ్ యుద్ధ విమానాలతో వెయ్యి కిలోల బాంబులతో జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడింది.భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తో పాకిస్తాన్ వణికిపోతుంది. ఈ సర్జికల్ స్ట్రైక్ అమర జవాన్లు చిందించిన ప్రతి రక్తపు బొట్టు కు సమాధానం గా నిలిచింది.
ఈరోజు జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో మూడు వందలకు పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టి ఇండియన్ ఆర్మీ తన పవర్ ఏంటో చూపించింది. దిక్కుతోచని స్థితిలో పడిన పాకిస్తాన్ తమ దేశానికి ఎలాంటి నష్టం జరగలేదని, ప్రాణ హాని కూడా లేదని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇంకోపక్క చైనా వంటి దేశాలతో దయచేసి తమకు సహకరించాలంటూ కోరుతోంది. ప్రస్తుతం ఆత్మరక్షణలో పడిన పాకిస్థాన్ తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తామని, ప్రతీకార దాడులు తప్పక చేస్తామంటూ ప్రకటిస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ భారత్ కు సరైన జవాబు చెప్తామని, భారతదేశంపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని, తమను తాము రక్షించుకునే హక్కు పాకిస్తాన్ కు ఉందని ఆయన తెలిపారు.

ఊహించని విధంగా భారత్ జరిపిన దాడి తో ఖంగుతిన్న పాకిస్తాన్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది. అనంతరం పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ మాట్లాడుతూ వాస్తవాధీన రేఖ దాటి భారత్ పాకిస్తాన్ లోకి చొరబాటు చేసి దాడులకు పాల్పడిందని, కచ్చితంగా ప్రతీకార దాడులు చేస్తామని వెల్లడించారు. ఇది భారత్ పాకిస్తాన్ పై చేసిన తీవ్రమైన దాడిగా ఆయన అభివర్ణించారు. దీనికి కచ్చితంగా సమాధానం చెబుతాం అంటూ పాక్ సైన్యం అందుకు సిద్ధంగా ఉందంటూ ప్రకటన చేశారు భారత్ తమపై జరిపిన దాడులపై ఇప్పటికే పలు దేశాలతో చర్చించామన్న ఖురేషి ప్రధానితో చర్చించాక తగిన నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించారు.ఇంత జరిగినా దాయాది దేశం మారకపోవటం యుద్ధ సంకేతమనే భావన కలుగుతుంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications