సీక్రెట్ గా అసిమ్ మునీర్ కూతురు పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా..?
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. అసిమ్ మునీర్ కూతురు మెహ్రూన్ పెళ్లి పీటలెక్కారు. ఆమె తన కజిన్ అబ్దుర్ రెహ్మాన్ ను వివాహమాడారు. అసిమ్ మునీర్ సోదరుడు క్వాజిమ్ మునీర్ కుమారుడే అబ్దుర్ రెహ్మాన్. ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్ పాకిస్థాన్ లోని రావల్పిండిలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఈ వివాహ వేడుకకు దేశంలోని టాప్ పొలిటికల్ లీడర్స్, మిలిటరీ అధికారులు హాజరయ్యారు. అయితే ఈ వివాహాన్ని సీక్రెట్ గానే నిర్వహించినట్లు సమాచారం. సెక్యూరిటీ దృష్ట్యా ఈ వివాహాన్ని రహస్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, త్రి దళాధిపతి అసిమ్ మునీర్ కూతురు వివాహం జరిగింది. తన మేనల్లుడైన అబ్దుర్ రెహ్మాన్ కు తన కూతురు మెహ్రూన్ ను ఇచ్చి వివాహం జరిపినట్లు పాకిస్థాన్ లోని మీడియా పేర్కొంది. పాకిస్థాన్ లోని రావల్పిండిలో గతవారం ఈ వివాహం జరిగినట్లు స్పష్టం చేసింది. ఈ వివాహ వేడుకకు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, మిలిటరీ అధికారులు హాజరైనట్లు సమాచారం. అయితే సాధారణ ప్రజలకు ఈ విషయం పెద్దగా తెలియకుండా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా వివాహాన్ని జరిపినట్లు తెలుస్తోంది. భద్రత కారణాల దృష్ట్యా ఈ పెళ్లి విషయాన్ని బయట ప్రచారం చేయలేదని సమాచారం.
పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ జాహీద్ గిష్కోరీ ఈ మేరకు పెళ్లికి సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అసిమ్ మునీర్.. తన సోదరుడు క్వాజిమ్ మునీర్ కుమారుడికే తన కుమార్తెను ఇచ్చి నిఖా చేసినట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రాజా మునిబ్ అనే మరొక జర్నలిస్టు కూడా ధ్రువీకరించారు. ఈ వివాహం రావల్పిండిలో జరిగిందని పేర్కొన్నారు.
ఇక అసిమ్ మునీర్ అల్లుడు అబ్దుర్ రెహ్మాన్ గతంలో పాకిస్థాన్ ఆర్మీలో కెప్టెన్ గా విధులు నిర్వర్తించినట్లు జర్నలిస్టు జాహీద్ గిష్కోరీ తెలిపారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ కు వెళ్లారని అన్నారు. ప్రస్తుతం అబ్దుర్ రెహ్మాన్ అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ఇక అసిమ్ మునీర్ కు మొత్తం నలుగురు కుమార్తెలు ఉన్నారని. తాజాగా వివాహం జరిగిన మెహ్రూన్ మూడో కుమార్తె అని జర్నలిస్టు గిష్కోరీ తెలిపారు.

అలాగే ఈ వివాహానికి పాకిస్థాన్ కు ప్రముఖ రాజకీయ నేతలు హాజరయ్యారని జర్నలిస్టు గిష్కోరీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, పంజాబ్ ప్రావిన్స్ సీఎం మర్యామ్ నవాజ్ షరీఫ్.. పాల్గొన్నారు. వీరితో పాటు అనేకమంది రిటైర్ జనరల్స్, మిలిటరీ అధికారులు పాల్గొన్నట్లు జర్నలిస్టు గిష్కోరీ తెలిపారు. అయితే ఈ వేడుకకు విదేశీ ప్రముఖులు ఎవరూ హాజరు కాలేదని సెక్యురిటీ కారణాల వల్ల ఇలా సీక్రెట్ గా నిర్వహించారని వివరించారు. అయితే మొత్తం మీద ఈ వివాహ వేడుకకు 400 మందికి పైగా అతిథులు హాజరైనట్లు తెలిపారు.
ఇక ఇటీవల అసిమ్ మునీర్ కు కీలక హోదాలు లభించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్(CDS) పదవిని సృష్టించి అసిమ్ మునీర్ కు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications