పహల్గాం దాడికి ముందు అమెరికాతో పాక్ డీల్..? ట్రంప్, మునీర్ లింక్స్ బయటకు.. దిమ్మతిరిగే రిపోర్టు..!

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రోజుకో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఓ సంచలన రిపోర్టు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. జమ్ముకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి కొద్ది రోజుల ముందే అమెరికా- పాకిస్థాన్ మధ్య ఓ ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇరు దేశాలకు చెందిన ప్రైవేట్ క్రిప్టో కరెన్సీల కంపెనీలు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

ట్రంప్ ఫ్యామిలీకు చెందిన క్రిప్టో కరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్థాన్ కు చెందిన ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ట్రంప్ కుటుంబానికి, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ కు సంబంధాలు ఉన్నట్లు సంచలన రిపోర్టు బయటకు వచ్చింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థలోకి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అనుసంధానం చేసే విషయంపై ఇరు దేశాల క్రిప్టో కరెన్సీ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రంప్ ఫ్యామిలీకు చెందిన క్రిప్టో కరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ లో ట్రంప్ కుమారులు ఎరిక్, ట్రంప్ జూనియర్ కు వాటా ఉంది. అలాగే ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్ నర్ కు కూడా 60 శాతం వాటా ఉన్నట్లు సమాచారం. ఈ ఏప్రిల్ లో ఈ కంపెనీ పాకిస్థాన్ కు చెందిన క్రిప్టో కౌన్సిల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపైనే ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా నుంచి క్రిప్టో కరెన్సీకు చెందిన అధికారులు పాకిస్థాన్ కు రాగా వారిని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారని సమాచారం. ఈ మేరకు అమెరికా ప్రతినిధులు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Pakistan Army Chief s Involvement in Trump-Linked Crypto Deal Raises Questions Amid Pahalgam Attack

అయితే ఈ ఒప్పందంలో మునీర్ జోక్యం చేసుకోవడంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా దేశ భద్రత.. టెర్రరిజం, ఇతర అంశాలపై చర్చించారా అన్న ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ ఒప్పందం ద్వారా బ్లాక్‌ఛైన్ సాంకేతికతను పాక్ ఆర్థిక వ్యవస్థలో చొప్పించేందుకు అనుమతి లభించిందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. అయితే భారత్ లోని విశ్లేషకులు మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణించాలని.. ప్రపంచ సంస్థలు విచారణ చేపట్టాలని సూచనలు చేస్తున్నారు.

మరోవైపు ఇటీవల ఖతార్ లో జరిగిన ఓ వాణిజ్య మీటింగ్ లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వెంట యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఉన్నారు. నాకు టిమ్‌ కుక్‌తో చిన్న సమస్య ఉంది. ఆయన భారత్‌లో యాపిల్ ప్లాంట్స్ పెట్టాలని అనుకున్నారు. కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాను. భారత్ లో టారిఫ్ లు అధికం. అమెరికాలో ఉత్పత్తి పెంచండి. అని ట్రంప్ పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+