ముందు అలా .. తర్వాత ఇలా ... టీవీ చానెళ్లకు అడ్డంగా దొరికిన గపూర్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పై భారత వాయుసేన జరిపిన దాడిపై పాకిస్థాన్ వైఖరి ఉసరవెల్లిని తలపిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మిరాజ్ ఫైటర్స్ తో ఐఏఎఫ్ సేనలు దాడిచేశాక .. భారత ప్రభుత్వం దాడులు విషయాన్ని ధ్రువీకరించకముందే .. సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు పాకిస్థాన్ ఆర్మీ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేసన్ అధినేత ఆసిఫ్ గపూర్. పీవోకే లోని బాలాకోట్, చికోటి, ముజఫర్ నగర్ లో దాడులు చేశాయని ప్రకటించారు. ఆ తర్వాత భారత ఐఏఎఫ్, విదేశాంగ శాఖ కార్యదర్శి దాడులు చేసినట్టు మీడియాకు వివరించారు.

అంతలోనే మారిన స్వరం ..
తమ అంతర్భాగంలో దాడి చేశారని .. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని బుకాయించారు గఫూర్. ఆ తర్వాత భారత్ ప్రకటన చేయడం .. 350 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు స్పష్టమవడంతో పాక్ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు గపూర్. మంగళవారం నాటి దాడులే కాదు మరిన్ని దాడులు చేస్తామనే సోషల్ మీడియాలో హెచ్చరికలు రావడంతో రిపోర్టర్ల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

Pakistan Army spokesperson Asif Ghafoor loses it on national television

భారత మీడియాపై విషం కక్కిన పాక్ రిపోర్టర్లు
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టి .. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందనే పక్కా సమాచారంతో ఫైటర్స్ అటాక్ చేశారు. దీనిపై పాకిస్థాన్ మీడియా అక్కసు వెళ్లగక్కింది. భారత మీడియాను గాడిదలో పోల్చి .. తన కపటబుద్ధిని బయటపెట్టుకున్నారు అక్కడి రిపోర్టర్లు. విలేకర్లు పత్రికాధర్మాన్ని విస్మరిస్తే .. సర్దిచెప్పాల్సిన గఫూర్ వారికి వంతపాడారు. 'మనం కూడా వారికి (భారత్ కు) బుద్ధి చెప్తాం .. కానీ ఇది సరైన సమయం కాదు. అలాగే మనం అబద్ధాలు చెప్పమని శుద్ధ అబద్ధాన్ని మీడియా ముఖంగా తెలిపారు. మనం చేసే చర్యను యావత్ పాకిస్థానే కాదు .. ప్రపంచం మొత్తం చూస్తుందని భారత్ ను హెచ్చరించే ప్రయత్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+