పాక్ రక్షణ రంగం మరింత బలోపేతం.. డిఫెన్స్ బడ్జెట్ భారీగా పెంపు.. భారత్ అలెర్ట్..?
ఆపరేషన్ సింధూర్ పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు భారీగా ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. టర్కీ, చైనా, నెదర్లాండ్స్ దేశాల నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక మిసైల్స్, డ్రోన్ లను భారత రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. అంతేకాక పాకిస్థాన్ లోని ఎయిర్ బేస్ లను కూడా భారత క్షిపణులు ధ్వంసం చేశాయి. దీంతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పాకిస్థాన్ పావులు కదుపుతోంది.
ఎంత కొట్టినా చావని పాముగా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇటీవల పాకిస్థాన్ పై తీసుకున్న చర్యలు, ఆపరేషన్ సింధూర్ కారణంగా ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిన్నది. సింధూ జలాల ఒప్పందం రద్దు, వీసాల జారీ రద్దు, ఇరు దేశాల మధ్య గగనతలం, ఎగుమతులు, దిగుమతులు రద్దు కారణంగా పాకిస్థాన్ కు ఆర్థికంగా భారీగా నష్టం వాటిల్లింది.
అయితే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రుణాలను రక్షణ రంగానికి వినియోగిస్తోంది పాకిస్థాన్. డిఫెన్స్ రంగానికి భారీగా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ ఎయిర్ బేస్ లు అనేకం ధ్వంసం అయ్యాయి. వాటిని తిరిగి పునర్మించేందుకు పాకిస్థాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు రక్షణ రంగానికి బడ్జెట్ ను ఏకంగా 18 శాతం పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక ఆధారంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.
2024 ఆర్థిక సంవత్సరానికి భారత రక్షణ రంగం బడ్జెట్ 86.1 బిలియన్ డాలర్లు ఉండగా ఇదే ఏడాదికి పాకిస్థాన్ డిఫెన్స్ బడ్జెట్ కేవలం 10.2 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. దీంతో పాకిస్థాన్.. రక్షణ రంగ కేటాయింపుల్లోనూ భారత్ తో పోటీ పడాలని ప్లాన్ వేస్తోంది. ఈ క్రమంలోనే రక్షణ రంగానికి అధిక నిధలు కేటాయించింది. ధ్వంసమైన వైమానిక స్థావరాలను తిరిగి నిర్మించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.

ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద ఉన్న ఆయుధాల్లో 82 శాతం చైనా సరఫరా చేసినవే. గత ఐదేళ్లలో వీటి సరఫరా మరింత పెరిగింది. పాకిస్థాన్ కు చైనా సరఫరా చేసిన ఆయుధాల్లో ప్రధానమైనది జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్. ఇలాంటివి ప్రస్తుతం పాక్ వద్ద 140 వరకు ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత జే-10 సీఈ ఫైటర్ జెట్.. ఇది 4.5 మల్టీ జనరేషన్ ఫైటర్ జెట్. 2022లో పాకిస్థాన్ చైనా నుంచి 36 జే-10 సీఈ ఫైటర్ జెట్స్ దిగుమతి చేసుకుంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications