ఇష్టం లేని పెళ్ళి చేశారని అత్తింట్లో 13 మందిని చంపిన వధువు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్:ఇష్టం లేని వివాహం చేసుకొన్నారని అత్తింటిలో 13 మందికి విషమిచ్చి చంపేసింది నవ వధువు. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకొంది. భర్తను చంపేందుకు ప్లాన్ చేసి చివరకు అత్తింట్లోని 13 మందిని ప్రాణాలను తీసింది హసియా అనే యువతి.

బలవంతపు వివాహం చేసుకున్న ఓ నవవధువు పథకం ప్రకారం విషమిచ్చి 13 మందిని హతమార్చింది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని లాహోర్‌ ప్రావిన్సులోని ముజఫర్‌గఢ్‌లో జరిగింది.

Pakistan bride accidentally poisons 13 family members in failed bid to kill husband

ఇటీవల బలవంతపు పెళ్లి చేసుకున్న హాసియా అనే మహిళ తన భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. భర్త అమ్జద్‌ను చంపేసేందుకు పాలలో విషం కలిపింది.అయితే అదృష్టవశాత్తు అమ్జద్‌ ఆ పాలు తాగలేదు. దీంతో అవే పాలతో లస్సీ తయారుచేసి అత్తింటివారందరికీ అందించింది. విషతుల్యమైన ఆ లస్సీ తాగి 13 మంది చనిపోయారు.

మరో 14 మంది విషప్రభావంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పథకం ప్రకారమే తానీ పని చేశానని పోలీసు విచారణలో హాసియా ఒప్పుకుంది. హత్యలో హాసియాకు సాయపడినట్లుగా భావిస్తున్న ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Pakistani woman has been arrested after a plot to murder her husband with a poisoned glass of milk led to the death of 13 family members.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి