పాక్ గగనతల మూసివేత అబద్ధం.. కవచాలుగా పౌర విమానాలు..? కేంద్రం షాకింగ్..!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరుపుతున్న ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే పాక్ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం.. అనంతరం లాహోర్ లోని గగనతల రక్షణ వ్యవస్థల్ని సైతం ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిన పాకిస్తాన్.. మోస పూరిత విధానాలతో తమను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇవాళ విదేశాంగశాఖ వెల్లడించింది.

పాకిస్తాన్ తమ గగనతలాన్ని మూసేసినట్లు చేసిన ప్రకటన పూర్తిగా అబద్ధమని భారత విదేశాంగశాఖ తెలిపింది. పౌర విమానాలను నడపడానికి ఇప్పటికీ అనుమతిస్తోందని వెల్లడించింది. నిన్న భారత నగరాలపై టర్కిష్ తయారీ డ్రోన్‌లను రహస్యంగా ప్రయోగించిందని పేర్కొంది. పాకిస్తాన్ తన గగనతలంలో ఎగురుతున్న అనుమానించని పౌర విమానాలను కవచాలుగా వాడుకుంటోందని భారత విదేశాంగశాఖ ఇవాళ వెల్లడించింది.

Pakistan cheating tactics didn t close airport using civilian flights as shield says centre

ఉత్తర భారతదేశం అంతటా పౌర భవనాలు, సైనిక స్థావరాలు, మతపరమైన నిర్మాణాల వైపు కనీసం 300-400 పాకిస్తానీ డ్రోన్‌లు దూసుకొచ్చినట్లు విదేశాంగశాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం కూడా పాకిస్తాన్ గగనతలంలో కొన్ని పౌర విమానాలు ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్‌లలో కనిపించాయని పేర్కొంది. అయితే భారతదేశం వైపు విమానాలు ఏవీ రాలేదని తెలిపింది. భారతదేశ వైమానిక రక్షణ నెట్‌వర్క్ డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుందని తెలిపింది.

జమ్మూ మరియు కాశ్మీర్‌లోని పూంచ్‌లో పాకిస్తాన్ చేసిన భారీ షెల్లింగ్ స్ధానికంగా ఓ పాఠశాలలోని ఇద్దరు విద్యార్థుల ఇంటిని తాకిందని, ఈ దాడిలో వారు చనిపోయినట్లు విదేశాంగశాఖ తెలిపింది. దేవాలయాలు, గురుద్వారాలు, కాన్వెంట్‌లను లక్ష్యంగా చేసుకోవడం పాకిస్తాన్ చేసిన కొత్త దారుణమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పాకిస్తాన్ కొన్ని ప్రాంతాలలో టర్కిష్ తయారీ అసిస్‌గార్డ్ సోంగర్ సాయుధ డ్రోన్‌లను ప్రయోగించిందని ఆయన తెలిపారు. భారత వైమానిక రక్షణ నెట్‌వర్క్ వాటిలో చాలా వాటిని జామ్ చేసి, మరికొన్నింటిని కూల్చివేసిందని పేర్కొన్నారు.

Take a Poll

పాకిస్తాన్ చేస్తున్న దురాక్రమణ కేవలం డ్రోన్లకే పరిమితం కాలేదని, సరిహద్దుల్లో కాల్పుల రూపంలో కూడా కొనసాగుతుందని విదేశాంగశాఖ తెలిపింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని సుందర్, ఉరి, పూంచ్, మెంధార్, రాజౌరి, అఖ్నూర్, ఉధంపూర్‌లలో నియంత్రణ రేఖ వెంబడి భారీ క్యాలిబర్ ఆర్టిలరీ తుపాకులు, సాయుధ డ్రోన్‌లను పాక్ ఉపయోగిస్తోందని తెలిపింది. దీని ఫలితంగా భారత సైనికులకు కొంత నష్టం, గాయాలు అయ్యాయని తెలిపింది. అయితే భారత కౌంటర్ కాల్పుల్లో పాకిస్తాన్ సైన్యం కూడా భారీ నష్టాలను చవిచూసిందని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+