ఎలుకను చంపి తెస్తే రూ.25 బహుమతి పొందొచ్చు!

పెషావర్: పాకిస్థాన్‌లోని పెషావర్‌ నగరాన్ని ఎలుకల సమస్య పీడిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఎలుకలను ఎలా అరికట్టాలో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ఓ ఆస్పత్రిలో పసిబిడ్డను ఎలుకలు కొరికి చంపడంతో కఠిన చర్యలకు ఉపక్రమించారు.

ఎలుకల నిర్మూలనలో ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఇందుకో ఓ ఆలోచన చేశారు. ఒక ఎలుకను చంపితే రూ.25 ఇస్తామని ప్రకటించారు. ఒకరు ఎన్ని ఎలుకలనైనా చంపొచ్చు. ఇందుకోసం వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ సర్వీస్‌ సంస్థ నాలుగు పట్టణాల్లో కొన్ని పాయింట్లు ఏర్పాటు చేస్తోంది.

Pakistan city announces rat-killing bounty after infestation

చచ్చిన ఎలుకల్ని తీసుకుని వాటిని తెచ్చిన వారికి.. ఒక్కో ఎలుకకు రూ.25 చొప్పున ఇస్తారు. కొంతకాలంగా అక్కడ సాధారణ ఎలుకల కంటే పెద్దగా 22-30 సెం.మీ.ల పొడవున్న ఎలుకలు ఎక్కువగా సంచరిస్తున్నాయని, ఇవి అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని, మనుషులను కొరుకుతున్నాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+