Indians In Pakistan Prisones: పాకిస్థాన్ జైల్లల్లో మగ్గుతున్న 682 మంది భారతీయులు..

ఒకప్పుడు ఆ దేశం మన దేశంలో భాగమే.. కానీ వారికి ప్రత్యేక దేశం కావాలనడంతో వారికి ప్రత్యేక దేశం ఇచ్చాం. ఆ దేశమే పాకిస్తాన్. అంటే పాక్ మన సోదర దేశం. ఆ దేశం, మన దేశం మంచి సంబంధాలు కొనసాగించాలి. కానీ పాక్ మొదటి నుంచి భారత్ పై విద్వేషం వెళ్లగక్కుతోంది. కశ్మీర్ తమదంటూ వాదిస్తోంది. ఉగ్రవాదులను పెంచి పోషిసిస్తూ ఇండియాపై ఉసిగోల్పోతోంది. భారత్ కు చెందిన వారిని జైల్లో పెడుతోంది. ఇలా భారత్ కు చెందిన 682 మందిని జైల్లో బంధించింది.

పాకిస్తాన్ ​లో 682 మంది ఇండియన్లు ఖైదీలుగా ఉన్నారని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. ఖైదీలుగా ఉన్న వారిలో 49 మంది సాధారణ పౌరులుకాగా..633 మంది మత్య్సకారులని వెల్లడించింది. ఇక మన దేశంలో 461 మంది పాక్ పౌరులు ఖైదీలుగా ఉన్నారని ఢిల్లీలోని విదేశాంగ శాఖ వెల్లడించింది. అందులో 345 మంది సాధారణ పౌరులు,116 మంది మత్స్యకారులునట్లు పేర్కొంది.

Pakistan confirms it has 682 Indian prisoners detained in its jails

ప్రతి సంవత్సరం జనవరి 01, జూలై 01 తేదీల్లో ఇరు దేశాలు పరస్పరం కస్టడీలో ఉన్న ఖైదీల జాబితాలను పరస్పరం మార్చుకోవాలని 21 మే 2008న ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా వివరాలు వెల్లడించారు. ముగ్గురు పౌర ఖైదీలను విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారతదేశం పాకిస్తాన్‌ను కోరింది. అంతేకాకుండా, పాకిస్తాన్ కస్టడీలో ఉన్న భారతీయులుగా భావిస్తున్న 105 మంది మత్స్యకారులు, 20 మంది పౌర ఖైదీలకు తక్షణమే కాన్సులర్ యాక్సెస్‌ను అందించాలని పాకిస్తాన్‌ను కోరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+