వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ నిషేధిత దేశాల జాబితాలో పాక్..? అవుననే అంటున్న వైట్ హౌస్ వర్గాలు

ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోకి ప్రవేశం నిషేధించిన దేశాల జాబితాలోకి పాకిస్తాన్ కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ రెనిక్ ప్రైబస్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోకి ప్రవేశం నిషేధించిన దేశాల జాబితాలోకి పాకిస్తాన్ కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ రెనిక్ ప్రైబస్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ప్రస్తుతం ఏడు ముస్లిం ఆధిక్య దేశాలకు చెందిన శరణార్థులు అమెరికాలో ఆశ్రయం పొందకుండా.. వలస రాకుండా.. పౌరసత్వం పొందకుండా ఈ చట్టం నిషేధిస్తోంది. దీనిని పాకిస్తాన్ కు కూడా వర్తింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Pakistan Could Be Put On Donald Trump's Immigration Ban List, Says White House

ఈ దేశాల నుంచి ముప్పు పొంచి ఉందని గతంలో అమెరికా కాంగ్రెస్, ఒబామా ప్రభుత్వం కూడా అంగీకరించాయి. పాకిస్తాన్ లో కూడా ఇటవంటి పరిస్థితులే ఉన్నాయి.

ఆయా దేశాలకు వెళ్లి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని రెనిక్ ప్రైబస్ తెలిపారు. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్ లకు వెళ్లిన వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని చెప్పారు. ప్రస్తుత ఆదేశాలను చూస్తే అమెరికన్లను రక్షించడానికే ట్రంప్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

English summary
The Donald Trump Administration had initially considered putting Pakistan into the controversial immigration ban list, White House Chief of Staff Reince Priebus has acknowledged. He further hinted that the ban - which restricts refugees, migrants and green-card holders from seven Muslim-dominated nations - could extend to Pakistan in the near future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X