Pakistan: మరోసారి దుర్భుద్ధిని చాటుకున్న పాక్.. టర్కీ, సిరియాకు సాయం చేసే విమానాలను అనుమతించని దాయాది దేశం..
భారత్.. టర్కీ, సిరియాకు చేస్తున్న సాయాన్ని అడ్డుకునేందుకు పాక్ ప్రయత్నించి విమర్శల పాలయింది.
కుక్క తోక ఎప్పుడూ వంకరే అన్నట్లుగా ఉంది పాకిస్థాన్ తీరు.. ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నా.. పాకిస్థాన్ తాజాగా వ్యవహరించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. టర్కీ, సిరియాకు సాయం చేసేందుకు మంగళవారం తెల్లవారుజామున టర్కీకి వెళ్తున్న భారత వైమానిక దళానికి చెందిన విమానాలకు పాకిస్థాన్ తన గగనతలం నుంచి వెళ్లేందుకు పాక్ నిరాకరించింది. దీంతో పాక్ పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

సోమవారం
సోమవారం తెల్లవారుజామున టర్కీ, సిరియాలో 7.9-తీవ్రతతో కూడిన భూకంపం వచ్చింది. ఈ తీవ్ర భూకంపంతో టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి. భారీ ప్రాణనష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఈ భూకంపం కారణంగా దాదాపు 4,800 మందికి పైగా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. 20 వేల మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ చాలా మంది శిథిలాల కిందే ఉన్నట్లు సమాచారం.

అదానా విమానాశ్రయం
దీంతో ఐక్యరాజ్యసమితి టర్కీ, సిరియాలకు సాయం చేయాలని ప్రపంచ దేశాలను కోరాయి. అప్పటికే టర్కీ, సిరియాకు సాయం చేయాలని నిర్ణయించిన భారత్ ఇండియన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు, ఆధునిక డ్రిల్లింగ్ పరికరాలు, మెడిక్స్, రెస్క్యూ డాగ్‌లతో టర్కీ వెళ్లాయి. అదానా విమానాశ్రయంలో దిగాయి. అయితే పాకిస్తాన్ తన గగనతలాన్ని ఉపయోగించడానికి విమానానికి అనుమతి నిరాకరించినందున భారత బృందాలు మరో మార్గంలో వెళ్లాల్సి వచ్చింది.

రక్షించే పనిలో భారత బృందాలు
మంగళవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన విమానం పాకిస్తాన్ మీద వెళ్లేందుకు అనుమతి అడిగారు దానికి పాక్ నిరాకరించండంతో మారో మార్గంలో వెళ్లాల్సి వచ్చిందని మీడియా కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే టర్కీ చేరుకున్న భారత బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి.

భారత్ టర్కీ ధన్యవాదాలు
టర్కీకి చెందిన డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (AFAD) శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సిరియాలో సిబ్బంది కొరత, సరైన పరికరాలు లేకపోవడంతో బాధితులను రక్షించేందుకు సమయం పడుతుంది. భారత్‌లోని టర్కీ రాయబార కార్యాలయం అందించిన సహాయానికి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది టర్కీ. "NDRF ప్రత్యేక శోధన & రెస్క్యూ బృందాలు, శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌లతో పాటు భూకంప సహాయక సామగ్రి మొదటి బ్యాచ్ ఇప్పుడే టర్కీకి చేరుకుంది. మీ మద్దతు, సంఘీభావానికి భారత్ కు ధన్యవాదాలు' అని టర్కీ రాయబార కార్యాలయం ఒక ట్వీట్‌లో పేర్కొంది.

ఇది రెండోసారి..
భారత్ ను ఇతర దేశాలకు సహాయం చేయకుండా పాక్ ఆపడం ఇది రెండోసారి. 2021లో ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న సమయంలో ఆప్ఘానిస్థాన్ దెబ్బతిన్నది. ఆ దేశాన్ని ఆదుకోవడానికి భారత్ ఆఫ్ఘనిస్తాన్‌కు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపాలని భారత్ నిర్ణయించింది. ఇస్లామాబాద్ మీదు ఆఫ్ఘనిస్తాన్‌కు వస్తువులను వాఘా సరిహద్దు పాయింట్ నుంచి పాకిస్తాన్ ట్రక్కులలో రవాణా చేయాలని ప్రతిపాదించింది. కానీ దీనికి పాకు ఒప్పుకోలేదు.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications