భారత్‌తో వ్యాపారం లేదు... వాఘా సరిహద్దును మూసివేయనున్న పాకిస్థాన్.
కశ్మీర్ లో ఆర్టికల్స్ తోలగింపుతో తోపాటు కశ్మీర్ విభజన అంశాలపై పాకిస్థాన్ విషం మరోసారి విషం చిమ్మింది. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలతో పాటు దౌత్యపరమైన చర్యలకు కూడ ఫుల్ స్టాప్ పెట్టింది. ఈనేపథ్యంలోనే ఇండియాలో ఉన్న పాకిస్థాన్ రాయబారిని వెనక్కి పిలిపించడంతోపాటు పాకిస్థాన్‌లో భారత రాయబారిని కూడ బహిష్కరించింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై పునర్విచారణ చేపట్టనున్నట్టు పాకిస్థాన్ నిర్ణయించింది.
భారత దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకోవడంతో పాటు రెండు దేశాల మధ్య కోనసాగిస్తున్న వ్యాపార లావాదేవీలకు చెక్ పెట్టేందుకు పాకిస్థాన్ నిర్ణయించింది. కశ్మీర్ పరిణామాల్లో భాగంగానే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటి సమాశమైంది.

ఈనేపథ్యంలో రెండు దేశాల మధ్య వ్యాపార మార్గమైన వాఘా సరిహద్దును మూసి వేయాలని కమిటి నిర్ణయించింది. వాఘా సరిహద్దు మూసి వేత వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఆగిపోతుంది. చట్టప్రకారం జరిగే రాకపోకలుఆగిపోతాయి. భారత దేశం నుండి ఎగుమతి అయ్యే ఉత్పత్తులు నిలిచితాయి. అయితే భారత దేశం కాకుండా,మరో దేశం నుంచి పాక్ వస్తువులను దిగుమతిచేసుకోవచ్చు.
మరోవైపు కశ్మీర్ అంశాన్ని యూఎన్ఓ దృష్టికి తీసుకెళ్లాలని సెక్యూరిటి కమిటి నిర్ణయించింది. ఈనేపథ్యంలోనే భారత స్వాతంత్య్ర దినోత్సమైన ఆగస్టు 15ను బ్లాక్ డేగా పాటించాలని నిర్ణయించడంతోపాటు కశ్మీరీల ప్రత్యేక పోరాటానికి సంఘీభావం వ్యక్తం చేయాలని నిర్ణయించాయి. దీంతో పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా సృష్టించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇమ్రాన్ ఖాన్ సైతం భారత దేశ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications